Thursday, 12 February 2026
  • Home  
  • జిల్లాస్థాయి రోడ్డు భద్రత కార్యక్రమాన్ని నిర్వహించిన : కలెక్టర్
- తెలంగాణ

జిల్లాస్థాయి రోడ్డు భద్రత కార్యక్రమాన్ని నిర్వహించిన : కలెక్టర్

నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి ) సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన రోడ్డు భద్రత, జిల్లా సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రోడ్డు భద్రతను, ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ప్రత్యేకించి పోలీస్ శాఖ గుర్తించిన బ్లాక్ స్పాట్లు, సూచించిన ప్రదేశాలలో ప్రమాదాల నివారణకు ఆర్ అండ్ బి, నేషనల్ హైవే, అలాగే ఇతర శాఖలు, పూర్తి సహకారం అందించి ప్రమాదాలను నివారించేందుకు సహకరించాలని కలెక్టర్ కోరారు. జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ, జిల్లాకు సంబంధించిన వివిధ రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రదేశాలను పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు గుర్తించి, సంబంధిత శాఖ అధికారులకు అధికారికంగా తెలియజేయడం జరుగుతుందని, అలాగే చిట్యాల అండర్ పాస్ వద్ద వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల,నాలుగైదు రోజులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగిందని, దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని కలెక్టర్ ను కోరారు.

నకిరేకల్ :నవంబర్ (పున్నమి ప్రతినిధి )
సోమవారం నల్గొండ జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన రోడ్డు భద్రత, జిల్లా సమావేశంలో కలెక్టర్ ఇలా త్రిపాఠి మాట్లాడుతూ, ఇటీవల రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయని, రోడ్డు భద్రతను, ప్రతి ఒక్కరు వ్యక్తిగత బాధ్యతగా తీసుకోవాలని కోరారు. ప్రత్యేకించి పోలీస్ శాఖ గుర్తించిన బ్లాక్ స్పాట్లు, సూచించిన ప్రదేశాలలో ప్రమాదాల నివారణకు ఆర్ అండ్ బి, నేషనల్ హైవే, అలాగే ఇతర శాఖలు, పూర్తి సహకారం అందించి ప్రమాదాలను నివారించేందుకు సహకరించాలని కలెక్టర్ కోరారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవర్ మాట్లాడుతూ, జిల్లాకు సంబంధించిన వివిధ రహదారులపై ప్రమాదాలు జరిగే ప్రదేశాలను పోలీస్ శాఖ ఎప్పటికప్పుడు గుర్తించి, సంబంధిత శాఖ అధికారులకు అధికారికంగా తెలియజేయడం జరుగుతుందని, అలాగే చిట్యాల అండర్ పాస్ వద్ద వర్షపు నీరు నిలిచిపోవడం వల్ల,నాలుగైదు రోజులు తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరిగిందని, దీనికి శాశ్వత పరిష్కారం కనుక్కోవాలని కలెక్టర్ ను కోరారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.