

జిల్లాలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ సంస్థ ఆధ్వర్యంలో గత మూడు రోజులుగా రుద్రపూజలు భక్తి భావభరితంగా నిర్వహించబడ్డాయి. ఆధ్యాత్మిక చైతన్యాన్ని పెంపొందించడమే లక్ష్యంగా ఈ పూజలు వివిధ ప్రాంతాల్లో ఘనంగా జరిగాయి.
మొదటిరోజు సాహితీ ఆంగ్ల మాధ్యమ పాఠశాలలో, రెండవ రోజు యారబాడు గ్రామంలోని నీలమ్మ తల్లి గుడి ఆవరణలో, ఈరోజు శ్రీకాకుళం ఆర్ట్ ఆఫ్ లివింగ్ సెంటర్లో రుద్రపూజలు నిర్వహించబడ్డాయి.
పండితుల మంత్రోచ్ఛారణతో వాతావరణం శాంతిమయంగా మారగా, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజల ద్వారా ఆధ్యాత్మిక ఆనందం పొందారు. పూజ అనంతరం భజనలు, సత్సంగం, ప్రసాద వితరణ కూడా నిర్వహించారు.
ఈ కార్యక్రమాలు శ్రీ శ్రీ రవిశంకర్ జీ స్ఫూర్తితో, సమాజంలో శాంతి, సాత్వికత, సద్విచారాల వ్యాప్తి లక్ష్యంగా కొనసాగుతున్నాయని నిర్వాహకులు తెలిపారు.

