కామారెడ్డి, 01 నవంబర్, (పున్నమి ప్రతినిధి) :
ప్రజల ఆరోగ్య రక్షణ దిశగా రాష్ట్ర ప్రభుత్వ కొత్త అడుగురాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో శనివారం కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ రామారెడ్డి మండ లాలలో బలవర్ధక అన్నం పంపిణీ కార్యక్ర మం ఘనంగా ప్రారంభమైందని. సొసైటీ చైర్మన్ మర్రి సదాశివరెడ్డి తెలిపారు సందర్భంగా వారు మాట్లా డుతూ,పోషకాహార ప్రజారోగ్య విభాగాల సంయు క్త ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో లబ్ధిదా రులకు ఫోర్టిఫైడ్ రైస్ (బలవర్ధక అన్నం) అందజే శారని చెప్పారు. ప్రజల ఆరోగ్యాన్ని మెరుగు పర చాలని ప్రభుత్వ సంకల్పంతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో సాధారణ బియ్యంలో ఇనుము, ఫోలిక్ యాసిడ్, విటమిన్ (B12) వంటి సూక్ష్మ పోషకాలు కలిపిన బియ్యాన్ని సరఫరా చేస్తున్నా రని అన్నారు. దీని ద్వారా ప్రత్యేకించి మహిళలు, చిన్నపిల్లలు, విద్యార్థులలో రక్తహీనత ( అనేమి యా ) సమస్యను తగ్గించడం ప్రధాన లక్ష్యం. పేద మధ్యతరగతి కుటుంబాలకు పోషక ఆహార భద్రత తో పాటు ఆరోగ్య రక్షణ అందించే దిశగా ఈ పథ కం కీలకంగా నిలుస్తుందని అధికారులు తెలిపా రు.ఈ కార్యక్రమంలో సిడిసి చైర్మన్ మహ్మద్ ఇర్షా దుద్దిన్,సీనియర్ నాయకులు బొలిపెల్లి మహేందర్ రెడ్డి, ఇందిరమ్మ కమిటీ సభ్యులు ఆకుల సిద్దిరాం లు, ఆకుల గంగరాజం, మండల సోషల్ మీడియా కోఆర్డినేటర్ నితిన్ గౌడ్, సాగర్ రెడ్డి, చెరుకు ప్రసా ద్, లింబాయల శ్రీనివాస్ రెడ్డి, శేకెల్లి మహేందర్, ఆకుల బాలయ్య, తిరుపతి కృష్ణమూర్తిలు తదిత రులు పాల్గొన్నారు.


