తొట్టంబేడు, మార్చి 25 (పున్నమి, క్రైం న్యూస్):తొట్టంబేడు కండ్రిగ సర్కిల్ ఇన్స్పెక్టర్ తిమ్మయ్య వెల్లడించిన వివరాల ప్రకారం, శ్రీకాళహస్తి పరిసర ప్రాంతాల్లో జరుగుతున్న టవర్ సామగ్రి దొంగతనాలపై పోలీసులు కీలక విజయాన్ని సాధించారు. శ్రీకాళహస్తి డీఎస్పీ నరసింహమూర్తి సూచనల మేరకు, తొట్టంబేడు సబ్ ఇన్స్పెక్టర్ బి. బాలకృష్ణ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి విస్తృత గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శ్రీకాళహస్తి రైల్వే స్టేషన్ సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న ఒక పురుషుడు, ఒక మహిళను పోలీసులు గుర్తించారు. వారిని ఆపేందుకు ప్రయత్నించగా పారిపోవడానికి యత్నించడంతో వెంటనే అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రాయల్ ఎన్ఫీల్డ్ బుల్లెట్ మోటార్ సైకిల్, హెల్మెట్లు, పరికరాలు స్వాధీనం చేసుకున్నారు. వాహనంపై నెంబర్ ప్లేట్లు మార్పులు చేసినట్లు గుర్తించారు. అదేవిధంగా, అదే ప్రాంతంలో జియో కంపెనీకి చెందిన రెండు సిస్కో రూటర్లు లభించగా, అవి లాంకో ఫ్యాక్టరీ, పల్లంపేట ప్రాంతాల నుంచి దొంగిలించబడినవని పోలీసులు నిర్ధారించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగించారు. విచారణలో నిందితులు మోడిగుంట కిరణ్ కుమార్ (A1), జె. రహేలు (A2)గా గుర్తించారు. వీరు నెల్లూరు జిల్లాకు చెందిన వారని తెలిపారు. నిందితుడు గతంలో జియో కంపెనీలో టవర్ టెక్నీషియన్‌గా పనిచేసిన అనుభవాన్ని ఉపయోగించి ఈ దొంగతనాలకు పాల్పడినట్లు అంగీకరించాడు. ఆంధ్రప్రదేశ్‌లో పలు ప్రాంతాల్లో టవర్ రూటర్లు, బ్యాటరీలు తదితర సామగ్రిని దొంగిలించినట్లు వెల్లడించాడు. దొంగిలించిన వస్తువులను చెన్నై నగరంలోని “ది సర్వర్ స్టోర్”లో విక్రయించినట్లు తెలిపిన నేపథ్యంలో, పోలీసులు అక్కడ దాడి నిర్వహించి మొత్తం 16 సిస్కో రూటర్లను స్వాధీనం చేసుకున్నారు. ఒక్కో రూటర్‌ను రూ.5,000కు కొనుగోలు చేసినట్లు షాప్ ప్రతినిధి అంగీకరించారు. ఈ కేసులో మొత్తం 16 సిస్కో రూటర్లు, నేరానికి ఉపయోగించిన మోటార్ సైకిల్, పరికరాలు తదితర సామగ్రిని పోలీసులు కేసు ప్రాపర్టీగా స్వాధీనం చేసుకుని, దర్యాప్తును కొనసాగిస్తున్నారు.

జియో టవర్ సామగ్రి దొంగల ముఠా గుట్టురట్టు – శ్రీకాళహస్తి పోలీసులు కీలక పట్టివేత