సినీ ప్రేక్షకులకు మత్తెక్కించే ఉత్సాహం రాబోతోంది.
మౌంట్ మెరు పిక్చర్స్ సమర్పణలో రూపొందిన ‘జిగ్రిస్’ చిత్రం ప్రపంచవ్యాప్తంగా నవంబర్ 14న విడుదల కానుంది.
ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషనల్ క్యాంపెయిన్‌లు ఇప్పటికే సోషల్ మీడియా వేదికలపై హల్‌చల్ సృష్టిస్తున్నాయి.
“మూడురోజులు మాత్రమే మిగిలాయి… మాడ్‌నెస్ రాబోతోంది!” అనే ట్యాగ్‌లైన్‌తో విడుదలైన పోస్టర్‌పై ప్రేక్షకుల్లో భారీ ఆసక్తి నెలకొంది.
ఈ చిత్రంలో కృష్ణ బురుగుల, ధీరజ్ కెవి, మనివాక, రామ్ నితిన్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు.
సినిమా నిర్మాణ బాధ్యతలు మౌంట్ మెరు పిక్చర్స్ నిర్వహించగా,
హరీష్ ఉత్, కృష్ణ వాగల్, వినైచిట్టెం, సయ్యద్ కమ్రాన్, చాణక్య ఆర్ట్, వాసుదేవ మాక్, వంశీ శేఖర్ తదితరులు ఈ ప్రాజెక్ట్‌కి మద్దతు అందించారు.


