జాలెం తాతారావుకు ప్రతిష్టాత్మకమైన భీమ్ రత్న అవార్డు ప్రధానం చేసిన దళిత చైతన్య వేదిక
ఆగస్టు 29 పున్నమి ప్రతినిధి @ రాజోలు
ప్రముఖ అంబేడ్కరీయులు, సామాజిక వివాహాల సంధానకర్త జాలెం తాతారావుకు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర దళిత చైతన్య వేదిక ప్రతిష్టాత్మకమైన భీమ్ రత్న అవార్డును ప్రదానం చేసింది. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో మాజీ సర్పంచ్ కొనుకు నాగరాజు అధ్యక్షతన జరిగిన అవార్డు ప్రదానోత్సవ కార్యక్రమంలో తొలుత అంబేడ్కర్ చిత్రపటానికి నాయకులు పూలమాలలేసి ఘనంగా నివాళులర్పించారు. తదుపరి నాయకులు మాట్లాడుతూ బాబాసాహెబ్ డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ను కలసి కరాచలనం చేసి, అంబేడ్కర్ అంత్యక్రీయాల్లో పాల్గొన్న జాలెం తాతారావుకు దళిత చైతన్య వేదిక భీమ్ రత్న అవార్డు ప్రదానం చేయ్యడం సముచితమైన విషయమన్నారు. 500 లకు పైగా సామాజిక వివాహాలు చేసి, బీవీ రమణయ్య ఉద్యమ బాటలో ముందుకు సాగిన జాలెం తాతారావు నేటి సమాజానికి ఆదర్శప్రాయుడన్నారు. అనంతరం నాయకులు హర్షధ్వానాలు చేస్తుండగా జై భీమ్ నినాదాలు హోరెత్తుతుండగా దళిత చైతన్య వేదిక వ్యవస్థాపకులు బత్తుల మురళీకృష్ణ, రాజోలు వైస్ ఎంపీపీ పొలుమూరి శ్యాంబాబు లు భీమ్ రత్న అవార్డును జాలెం తాతారావుకు ప్రదానం చేశారు. మట్టా సురేష్ అవార్డు సత్కారా పత్రాన్ని చదువుతుండగా వేదిక సభ్యులైన చిలకపాటి శ్రీధర్, లిఖితపూడి బుజ్జి, మందపాటి మధు, బొడ్డపల్లి పుల్లయ్య, దీపాటి శివప్రసాద్ మెడబల శ్యాం శేఖర్, పొన్నమాటి భాస్కర్, కాకర విశ్వనాధం, ఉప్పే జగదీష్ లు శాలువా, పూలమలతో సత్కరించి తలపై నీలి కీర్తి కిరీటాన్ని అలంకరించి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు జాలెం సుబ్బారావు, ఉమాపార్వతీ దంపతులు, జాలెం రాంబాబు, జాలెం భీమారావు, జాలెం సుస్మా, సర్పంచ్ లు జాలెం రమణకుమారి, గెడ్డం వెంకటేశ్వరరావు, బళ్ళ శ్రీనివాస్, తాళ్ళ నాగరాజు, అడబాల తాతకాపు, ఎంపీటీసీల సమైక్య అధ్యక్షులు నెల్లి దుర్గాప్రసాద్ నాయకులు కలిగితి పళ్ళం రాజు, ముకరం హుస్సేన్, విప్పర్తి సాయిబాబు, నీతిపూడి చంద్రరావు, భూపతి వెంకటపతి, చింతా రాజబాబు, గెడ్డం ఫిలిప్ రాజు, కొల్లాబత్తుల అశోక్, గెడ్డం తులసీ భాస్కర్, తోటే ప్రతాప్, నీతిపూడి మహేష్, బత్తుల శ్రీను, కోళ్ళ సురేష్, రాయుడు శ్రీనివాస్, జాలెం రాజేష్,జేటి ఫ్రెండ్స్ సర్కిల్, రాయుడు నాగేశ్వరరావు, కడలి సత్యనారాయణ, మొల్లేటి శ్రీనివాస్, విప్పర్తి గణపతి రావు, మొల్లేటి పార్వతీ, కొల్లాబత్తుల చిన్ని, అనుకుల కుమార్, విజయ కుమారి, బత్తుల వెంకటరమణ, బత్తుల రాంబాబు, పున్నం ప్రసాద్, బళ్ళ రాంబాబు, పొన్నమండ వెంకటేశ్వరరావు, వానరసి ప్రసాద్, కడలి బాబూరావు, తాటికాయల్ ఉదయ్ భాస్కర్, అడబాల అబ్బులు, కల్మి అబ్బాస్ తదితరులు పాల్గొన్నారు.



1 Comment
tlover tonet
August 29, 2025It is perfect time to make some plans for the future and it’s time to be happy. I have read this post and if I could I desire to suggest you some interesting things or tips. Perhaps you can write next articles referring to this article. I want to read more things about it!