పున్నమి న్యూస్(కోనసీమ), సీనియర్ జర్నలిస్ట్ రమణ:
జాతీయ హిందీ లాంగ్వేజ్ సలహా కమిటీ సభ్యుడిగా నియమితులైన బీజేపీ సీనియర్ నాయకులు, మైనారిటీ మోర్చా జిల్లా అధ్యక్షుడు సంషు సాద్విక్ ను బుధవారం పి.గన్నవరం లో బీజేపీ జిల్లా అధ్యక్షులు అడబాల సత్యనారాయణ ఆధ్వర్యంలో బీజేపీ నేతలు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే అయ్యాజీ వేమా, రాష్ట్ర అధికార ప్రతినిధులు నల్లా పవన్, పెద్దిరెడ్డి రవికిరణ్ లు పాల్గొని మాట్లాడుతూ సాద్విక్ పార్టీకి విశేష సేవలందించారు అన్నారు. ఈ సందర్భంగా అతనికి అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి.గన్నవరం మండల అధ్యక్షులు తిక్క సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శులు సలాది వీరబాబు, చీకరమెల్లి శ్రీనివాసరావు, ఇంచార్జి ఇళ్ల సత్యనారాయణ, తమనంపూడి రామకృష్ణారెడ్డి, మాలే శ్రీనివాస్ నగేష్, గనిశెట్టి వెంకటేశ్వరరావు, చొల్లంగి త్రినాధ్, చిట్టినీడి రంగసాయి, కముజు శ్రీనివాసు, గండ్రోతు వీర గోవిందరావు, నందం శ్రీలక్ష్మి, యనమదల రాజ్యలక్ష్మి, మోకా ఆదిలక్ష్మి, కొండేటి జయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.


