స్వతంత్ర భారతదేశానికి తొలి విద్యాశాఖ మంత్రిగా విశేష కృషి చేసిన మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతి సందర్భంగా ప్రతి సంవత్సరం నవంబర్ 11న జాతీయ విద్యా దినోత్సవాన్ని దేశవ్యాప్తంగా జరుపుకుంటారు. భారత విద్యా వ్యవస్థకు పునాదులు వేసిన ఆజాద్ గారు విద్యా విస్తరణ, సమాన అవకాశాలు మరియు జ్ఞాన ప్రబోధానికి అంకితభావంతో పనిచేశారు.
ఈ సందర్భాన్ని పురస్కరించుకుని డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ జిల్లా APPTA A సంస్థ తరఫున అధ్యక్షుడు షబ్బీర్ హుస్సేన్ మరియు ప్రధాన కార్యదర్శి షానవాజ్ హుస్సేన్ మాజింద్రాణి గారు ప్రజలకు జాతీయ విద్యా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
విద్య ప్రతి ఒక్కరికీ మౌలిక హక్కు అని గుర్తుచేస్తూ, ఆజాద్ గారి ఆశయాలను సాకారం చేయడం మనందరి బాధ్యతగా ఈ దినోత్సవం గుర్తు చేస్తోంది


