జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్‌లు ఏర్పాటు చేయనున్నట్లు జాతీయ రహదారి ప్రాధికార సంస్థ (NHAI) ప్రకటించింది. ఈ క్యూఆర్ కోడ్‌ల ద్వారా ఆయా రహదారుల ప్రాజెక్టుకు సంబంధించిన పూర్తి సమాచారం ప్రయాణికులకు అందుబాటులోకి వస్తుంది.
ఈ క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే వచ్చే సమాచారం:
జాతీయ రహదారి నంబర్
హైవే ఛైనేజ్ (హైవే ప్రారంభం నుండి ఆ లొకేషన్ దాకా గల దూరం)
ప్రాజెక్ట్ పొడవు
హైవే గస్తీ (పెట్రోలింగ్) బృంద వివరాలు
టోల్ మేనేజర్ కాంటాక్ట్ నంబర్
రెసిడెంట్ ఇంజినీర్ వివరాలు
అత్యవసర హెల్ప్‌లైన్ నంబర్ 1033
సమీప పెట్రోల్ బంకులు
ఆసుపత్రులు, అత్యవసర వైద్య సౌకర్యాలు
ఈ విధంగా, ప్రయాణికులకు అవసరమైన సమాచారం తక్షణమే అందేలా చేస్తూ, రహదారి భద్రత, సేవల వినియోగాన్ని మెరుగుపరచడం ఈ చర్య యొక్క ముఖ్య ఉద్దేశ్యం.


