Thursday, 5 February 2026
  • Home  
  • జాతీయ రహదారి భద్రతపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం
- విశాఖపట్నం

జాతీయ రహదారి భద్రతపై జిల్లా స్థాయి సమీక్ష సమావేశం

విశాఖ జనవరి (పున్నమి ప్రతినిధి) జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా 04-01-2026న జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విశాఖపట్నంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించబడింది. రహదారి మరియు భవనముల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ, జీ.వి.ఎం.సి (GVMC), నేషనల్ హైవే విభాగం, ఏపీ ఎస్‌ఆర్‌టీసీ, రవాణా శాఖ, డీఎం & హెచ్‌వో అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో నేషనల్ హైవేలు మరియు ప్రధాన రహదారులపై రోడ్ ఇంజనీరింగ్ డిజైన్ మార్పులు, అవసరమైన ప్రదేశాల్లో సైన్ బోర్డుల ఏర్పాటు, స్పష్టమైన రోడ్ మార్కింగ్స్, పాదాచారుల భద్రతకు హెచ్చరిక సూచికలు, వేగ పరిమితి బోర్డులు, పాఠశాలలు మరియు ఆసుపత్రుల సమీపంలో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించి జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలని సమావేశంలో తీర్మానించారు. అలాగే రవాణా శాఖ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు నేషనల్ హైవేల్లో ప్రయాణించే ఆటో రిక్షా డ్రైవర్లు, లెర్నింగ్ లైసెన్స్ దారులు మరియు ప్రజలకు రహదారి నియమాలు, వేగ నియంత్రణ, ప్రయాణికుల భద్రతపై PPT ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు.

విశాఖ జనవరి (పున్నమి ప్రతినిధి)

జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల సందర్భంగా 04-01-2026న జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు విశాఖపట్నంలో జిల్లా రహదారి భద్రతా కమిటీ సమావేశం నిర్వహించబడింది. రహదారి మరియు భవనముల శాఖ పర్యవేక్షక ఇంజనీర్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ, జీ.వి.ఎం.సి (GVMC), నేషనల్ హైవే విభాగం, ఏపీ ఎస్‌ఆర్‌టీసీ, రవాణా శాఖ, డీఎం & హెచ్‌వో అధికారులు పాల్గొన్నారు. సమావేశంలో నేషనల్ హైవేలు మరియు ప్రధాన రహదారులపై రోడ్ ఇంజనీరింగ్ డిజైన్ మార్పులు, అవసరమైన ప్రదేశాల్లో సైన్ బోర్డుల ఏర్పాటు, స్పష్టమైన రోడ్ మార్కింగ్స్, పాదాచారుల భద్రతకు హెచ్చరిక సూచికలు, వేగ పరిమితి బోర్డులు, పాఠశాలలు మరియు ఆసుపత్రుల సమీపంలో స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటు వంటి అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ అంశాలపై సమగ్ర నివేదిక రూపొందించి జిల్లా కలెక్టర్‌కు సమర్పించాలని సమావేశంలో తీర్మానించారు. అలాగే రవాణా శాఖ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్లు నేషనల్ హైవేల్లో ప్రయాణించే ఆటో రిక్షా డ్రైవర్లు, లెర్నింగ్ లైసెన్స్ దారులు మరియు ప్రజలకు రహదారి నియమాలు, వేగ నియంత్రణ, ప్రయాణికుల భద్రతపై PPT ప్రదర్శన ద్వారా అవగాహన కల్పించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.