నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తుల ప్రక్రియను వేగవంతo చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం ఆమె శాలిగౌరారం ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి జాతీయ కుటుంబ ప్రయోజన కింద వచ్చిన దరఖాస్తులు వివరాలను ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, తహసిల్దార్
జమీరుద్దీన్ లను అడిగి తెలుసుకున్నారు.
ఏప్రిల్ ఒకటి 2017 నుండి మండలంలో 176 మరణాలు సంభవించగా, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద 73 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 23 దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించడం జరిగిందని తహసిల్దార్ జిల్లా కలెక్టర్ కు వివరించారు,
జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద లబ్ధిదారులకు మేలు చేకూర్చేందుకు గాను దరఖాస్తుల స్వీకరణ పరిశీలన ప్రక్రియలను వేగవంతం చేసి శనివారంలోగా ఆర్డిఓ ద్వారా ఆన్లైన్లో పంపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు.
రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల తుది ఓటర్ జాబితా ప్రచురణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలను ఎంపీడీవో జ్యోతిలక్ష్మి ద్వారా అడిగి తెలుసుకున్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ శాలిగౌరారం నుండి ఊట్కూరు వెళ్లే రహదారిలో కాజువే పై నీరు ప్రవహిస్తుండగా పరిశీలించారు. అలాగే
ఊటుకూరు నుండి బండమీదిగూడెం వెళ్లే రహదారి వద్ద కూడా రోడ్డుపై నీరు ప్రవహిస్తున్నదని తెలుసుకొని పరిశీలించి పరిస్థితిపై నివేదిక సమర్పించాలని తహసిల్దార్, ఎంపీడీవోలను ఆదేశించారు.

జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తుల ప్రక్రియను వేగవంతం చేయాలన్న : జిల్లా కలెక్టర్
నకిరేకల్ : ఆగస్ట్ (పున్నమి ప్రతినిధి) జాతీయ కుటుంబ ప్రయోజన పథకం దరఖాస్తుల ప్రక్రియను వేగవంతo చేయాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఆదేశించారు. గురువారం ఆమె శాలిగౌరారం ఎంపీడీవో కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించి జాతీయ కుటుంబ ప్రయోజన కింద వచ్చిన దరఖాస్తులు వివరాలను ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, తహసిల్దార్ జమీరుద్దీన్ లను అడిగి తెలుసుకున్నారు. ఏప్రిల్ ఒకటి 2017 నుండి మండలంలో 176 మరణాలు సంభవించగా, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద 73 దరఖాస్తులు వచ్చాయని, వాటిలో 23 దరఖాస్తులను పూర్తిస్థాయిలో పరిశీలించడం జరిగిందని తహసిల్దార్ జిల్లా కలెక్టర్ కు వివరించారు, జాతీయ కుటుంబ ప్రయోజన పథకం కింద లబ్ధిదారులకు మేలు చేకూర్చేందుకు గాను దరఖాస్తుల స్వీకరణ పరిశీలన ప్రక్రియలను వేగవంతం చేసి శనివారంలోగా ఆర్డిఓ ద్వారా ఆన్లైన్లో పంపించాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు గ్రామ పంచాయతీల తుది ఓటర్ జాబితా ప్రచురణకు తీసుకుంటున్న చర్యలపై వివరాలను ఎంపీడీవో జ్యోతిలక్ష్మి ద్వారా అడిగి తెలుసుకున్నారు.అనంతరం జిల్లా కలెక్టర్ శాలిగౌరారం నుండి ఊట్కూరు వెళ్లే రహదారిలో కాజువే పై నీరు ప్రవహిస్తుండగా పరిశీలించారు. అలాగే ఊటుకూరు నుండి బండమీదిగూడెం వెళ్లే రహదారి వద్ద కూడా రోడ్డుపై నీరు ప్రవహిస్తున్నదని తెలుసుకొని పరిశీలించి పరిస్థితిపై నివేదిక సమర్పించాలని తహసిల్దార్, ఎంపీడీవోలను ఆదేశించారు.

