అనపర్తి — పున్నమి ప్రతినిధి
జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ సందర్భంగా ప్రధానోపాధ్యాయులు వెంకటరెడ్డి మాట్లాడుతూ, ఇంధన పొదుపుతో భావితరాలకు వెలుగు నింపవచ్చని పేర్కొన్నారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విద్యుత్ ఏఈ వీరభద్రరావు విద్యుత్ ఆదా అవసరాన్ని వివరించారు. పాఠశాలలో నిర్వహించిన చిత్రలేఖనం పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో విద్యా కమిటీ చైర్మన్ మల్లిడి పార్వతి, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


