నెల్లూరు జిల్లా, ధనలక్ష్మీపురంలో ఉన్న వీ.బి.ఆర్ పాఠశాలలో హిందీ పండిట్‌గా సేవలందిస్తున్న శ్రీ కేతరాజు నరేంద్ర కు గౌరవనీయమైన డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ జాతీయ అవార్డు లభించింది. గుంటూరులోని సదరన్ ప్రైవేట్ లెక్చరర్స్ అండ్ టీచర్స్ ఆర్గనైజేషన్ వారు ఇచ్చే ఈ ప్రతిష్ఠాత్మక అవార్డు ను ఈరోజు, తేదీ: 13-04-2025 న నరేంద్ర గారికి అందజేశారు.
హిందీ భాషాభివృద్ధి, విద్యారంగంలో ఆయన చేస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ అవార్డు లభించటం గర్వకారణం. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడంలో, హిందీ భాషపై వారి ఆసక్తిని పెంపొందించడంలో కేతరాజు నరేంద్ర గారి పాత్ర ప్రశంసనీయం.
ఈ సందర్భాన్ని పురస్కరించుకొని వీ.బి.ఆర్ పాఠశాల డైరెక్టర్ శ్రీనివాసరెడ్డి గారు, తోటి ఉపాధ్యాయులు, మిత్రులు మరియు కుటుంబ సభ్యులు నరేంద్ర గారికి హార్దిక శుభాకాంక్షలు తెలిపారు. జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన నరేంద్ర గారు మరిన్ని పురస్కారాలు అందాలని వారు ఆకాంక్షించారు.
ఈ అవార్డు విద్యారంగానికి, హిందీ భాషాభివృద్ధికి ఆయన చేస్తున్న కృషికి నిదర్శనం.