పి. గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు జాలెం సుబ్బారావు ఆంద్రప్రదేశ్ రాష్ట్ర జల వనరుల అభివృద్ధి శాఖామంత్రి నిమ్మల రామానాయుడుని బుధవారం కల్సి శాలువాతో ఘనంగా సత్కరించారు. ఈ మేరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమజిల్లా మామిడికుదురు మండలం నగరం గ్రామంలో బుధవారం జాలెం సుబ్బారావు మాట్లాడుతూ ఆంద్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడ్ని కల్సి పి గన్నవరం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ కోసం కష్టపడి పనిచేసిన ప్రతీ సామాన్య కార్యకర్తకు సముచిత గుర్తింపు ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలని కోరినట్లు తెలిపారు. పి గన్నవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో జరుగుతున్న అన్నీ విషయాలను మంత్రి నిమ్మల దృష్టికి తీసుకెళ్లినట్లు జాలెం తెలిపారు. జాలెం సుబ్బారావుతో పాటుగా పెదలంక గ్రామ సర్పంచ్ తాళ్ళ నాగరాజు, తెదేపా యూనిట్ ఇంచార్జ్ కోళ్ళ సురేష్, న్యాయవాది బిరుదుగంటి రవి తదితరులు మంత్రి నిమ్మల రామానాయుడ్ని కల్సిన వారిలో ఉన్నారు.

జల వనరుల అభివృద్ధి శాఖ మంత్రిని సత్కరించిన జాలెం సుబ్బారావు