అనకాపల్లి జిల్లా, ఏప్రిల్ 11 (పున్నమి న్యూస్ ప్రతినిధి ఆనంద్): జలదార–జలహారతి కార్యక్రమం గ్రామంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ఇరిగేషన్ విభాగం నుంచి ఏఈ హాజరై, గ్రామంలోని పంట కాలువల పరిస్థితిని పరిశీలించారు.
పులపర్తి నుంచి ఏటికొప్పాక కాలువ ద్వారా గ్రామానికి నీరు సక్రమంగా అందుతున్నదా లేదా అన్న విషయంపై గ్రామసభలో విస్తృతంగా చర్చ జరిగింది. రైతులు తమ సమస్యలను వివరంగా తెలియజేస్తూ, కొన్ని ప్రాంతాలకు నీరు చేరడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దీనిపై స్పందించిన ఏఈ, కాలువల పక్క భాగాల అభివృద్ధి పనులు త్వరలో చేపట్టి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. ఇరిగేషన్ నీటిపారుదల చైర్మన్ చింతలపాటి దేవి ప్రసాద్ రాజు సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో గ్రామ సెక్రటరీ గిరి ప్రసాద్, కాండ్రకోట చిరంజీవి, అన్నం బాబూజీ,నగిరెడ్డి అచ్చయనాయుడు,సింహాచలం, నాయుడు మాస్టారు, రాయి చలపతి, సరోజిరావు, కొండయ్య నాయుడు, భజంత్రీల శ్రీను తదితరులు పాల్గొన్నారు.
గ్రామసభ స్పెషల్ ఆఫీసర్ ఎమ్మార్వో సమక్షంలో రైతుల ఇబ్బందులను గుర్తించి, పంట కాలంలో నీటి సరఫరా ఎటువంటి అంతరాయం లేకుండా చర్యలు తీసుకుంటామని అధికారులు స్పష్టం చేశారు.



