నందిగామ స్థానిక జర్నలిస్టు మస్తాన్ అనారోగ్యంతో బాధ పడుతుండగా, జర్నలిస్టు సంఘ నాయకులు ఆయనకు అండగా నిలిచారు. గతంలో గుండెకు బైపాస్ సర్జరీ జరిగిన మస్తాన్ ఇటీవల కొంత అస్వస్థతకు గురికావడంతో నందిగామలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘ జాతీయ నాయకులు పి. మీరాహుస్సేన్ ఖాన్, జిల్లా నాయకులు అకుల వెంకటనారాయణ, పఠాన్ సైదాఖాన్, జర్నలిస్టులు హామీద్, అన్నవరపు చంద్రశేఖర్ తదితరులు మస్తాన్ ను పరామర్శించారు. సంఘం తరఫున రూ.5,000 నగదు, 25 కిలోల బియ్యం, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగ ది న్యూ ఇండియన్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, APBWJA వ్యవస్థాపక అధ్యక్షుడు పి. మీరా హుస్సేన్ ఖాన్ మాట్లాడుతూ – “మస్తాన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలన్నది మన అందరి బాధ్యత” అన్నారు.
జర్నలిస్టు మస్తాన్ కు సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుం దని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

జర్నలిస్టు మస్తాన్‌కు జర్నలిస్టు సంఘ నాయకుల చేయూత
నందిగామ స్థానిక జర్నలిస్టు మస్తాన్ అనారోగ్యంతో బాధ పడుతుండగా, జర్నలిస్టు సంఘ నాయకులు ఆయనకు అండగా నిలిచారు. గతంలో గుండెకు బైపాస్ సర్జరీ జరిగిన మస్తాన్ ఇటీవల కొంత అస్వస్థతకు గురికావడంతో నందిగామలోని తన నివాసంలో విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా జర్నలిస్టు సంఘ జాతీయ నాయకులు పి. మీరాహుస్సేన్ ఖాన్, జిల్లా నాయకులు అకుల వెంకటనారాయణ, పఠాన్ సైదాఖాన్, జర్నలిస్టులు హామీద్, అన్నవరపు చంద్రశేఖర్ తదితరులు మస్తాన్ ను పరామర్శించారు. సంఘం తరఫున రూ.5,000 నగదు, 25 కిలోల బియ్యం, పండ్లు అందజేశారు. ఈ సందర్భంగ ది న్యూ ఇండియన్ జర్నలిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, APBWJA వ్యవస్థాపక అధ్యక్షుడు పి. మీరా హుస్సేన్ ఖాన్ మాట్లాడుతూ – “మస్తాన్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నాం. ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యం ఇవ్వాలన్నది మన అందరి బాధ్యత” అన్నారు. జర్నలిస్టు మస్తాన్ కు సంఘం ఎల్లప్పుడూ అండగా ఉంటుం దని ఆయన భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.

