Tuesday, 24 March 2026
  • Home  
  • జర్నలిస్టులే దిక్సూచి : బిజెపి విశాఖ జిల్లా అధ్యక్షులు ఎం.ఎన్. పరుశురామరాజు.
- విశాఖపట్నం

జర్నలిస్టులే దిక్సూచి : బిజెపి విశాఖ జిల్లా అధ్యక్షులు ఎం.ఎన్. పరుశురామరాజు.

విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి) విశాఖపట్నం. డాబా గార్డెన్స్ , విజేఎఫ్ ప్రెస్ క్లబ్ : జర్నలిస్టులే పాలకులను సరైన మార్గంలో నడిపించే దిక్సూచులని బిజెపి విశాఖ జిల్లా అధ్యక్షులు ఎం.ఎన్. పరుశురామరాజు అన్నారు. జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో జాప్ సభ్యులకు గుర్తింపు కార్డులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా పరశురామరాజు మాట్లాడుతూ జర్నలిస్టులు నిర్వహించే బాధ్యత పైనే ప్రజాస్వామ్యం మనగడ ఆధారపడి ఉంటుందన్నారు. ప్రజలకు, పాలకులకు వారిధిగా ఉంటూ పాత్రికేయులు అందించే సేవలు అమోఘమన్నారు. ప్రజా సమస్యలను, పాలకుల తప్పిదాలను ఎత్తిచూపుతూ జర్నలిస్టులు సమాజానికి చేసే సేవలను కొనియాడారు. జర్నలిస్టులు అందించే సేవలు ఫలితంగానే సమాజం అభివృద్ధి జరుగుతుందన్నారు. జాప్ విశాఖ విశాఖ అధ్యక్షులు కే.ఎం. కీర్తన్ మాట్లాడుతూ తమ యూనియన్ సభ్యుల సంక్షేమానికి రాబోయే రోజుల్లో పలు కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులకు రైలులో ప్రయాణానికి రాయితీతో కూడిన పాసులను పునరుద్ధరించాలని కోరారు. పాత్రికేయులకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కీర్తన్ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పాత్రికేయులు దారిద్ర రేఖకు దిగువన నివసిస్తున్నారని వారి సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు తమ యూనియన్ ఎల్లప్పుడు పనిచేస్తూ ఉంటుందని కీర్తన్ తెలిపారు. జాప్ విశాఖ విశాఖ ప్రధాన కార్యదర్శి జెవికె అప్పలరాజు మాట్లాడుతూ తమ యూనియన్ నిరంతరం జర్నలిస్టుల సంక్షేమానికి పనిచేస్తూనే ఉంటుందని తెలిపారు. పలు రాష్ట్రాల్లో సీనియర్ జర్నలిస్టులకు పింఛన్ ఇస్తున్నట్లుగా మన రాష్ట్రంలో కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జాప్ విశాఖ కార్యవర్గ ప్రతినిధులు,,గంట చంద్రశేఖర్ వి ఉదయ్ కుమార్, జి దానేష్, కే సందీప్ కే పృథ్వీరాజ్ వై.యస్ సాయికుమార్, పి .అర్జున్, ఎస్ రామకృష్ణ, , ఎస్. ఎన్. నాయుడు, ఆర్. శ్రీనివాసరావు, జి రాజు, కే .శంకర్ ,సురేష్, జి సతీష్, జి. శ్రీనివాస్, శ్రీనివాస్, ప్రసాద్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రంగాలకు చెందిన జర్నలిస్టులు, ఫోటో వీడియో జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

విశాఖ అక్టోబర్ (పున్నమి ప్రతినిధి)

విశాఖపట్నం. డాబా గార్డెన్స్ , విజేఎఫ్ ప్రెస్ క్లబ్ : జర్నలిస్టులే పాలకులను సరైన మార్గంలో నడిపించే దిక్సూచులని బిజెపి విశాఖ జిల్లా అధ్యక్షులు ఎం.ఎన్. పరుశురామరాజు అన్నారు. జర్నలిస్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ విశాఖ జిల్లా శాఖ ఆధ్వర్యంలో యూనియన్ సభ్యులకు గుర్తింపు కార్డుల పంపిణీ కార్యక్రమంలో ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. విజేఎఫ్ ప్రెస్ క్లబ్ లో జరిగిన కార్యక్రమంలో జాప్ సభ్యులకు గుర్తింపు కార్డులను ఆయన అందజేశారు. ఈ సందర్భంగా పరశురామరాజు మాట్లాడుతూ జర్నలిస్టులు నిర్వహించే బాధ్యత పైనే ప్రజాస్వామ్యం మనగడ ఆధారపడి ఉంటుందన్నారు. ప్రజలకు, పాలకులకు వారిధిగా ఉంటూ పాత్రికేయులు అందించే సేవలు అమోఘమన్నారు. ప్రజా సమస్యలను, పాలకుల తప్పిదాలను ఎత్తిచూపుతూ జర్నలిస్టులు సమాజానికి చేసే సేవలను కొనియాడారు. జర్నలిస్టులు అందించే సేవలు ఫలితంగానే సమాజం అభివృద్ధి జరుగుతుందన్నారు. జాప్ విశాఖ విశాఖ అధ్యక్షులు కే.ఎం. కీర్తన్ మాట్లాడుతూ తమ యూనియన్ సభ్యుల సంక్షేమానికి రాబోయే రోజుల్లో పలు కార్యక్రమాలు చేపట్టబోతున్నట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం జర్నలిస్టులకు రైలులో ప్రయాణానికి రాయితీతో కూడిన పాసులను పునరుద్ధరించాలని కోరారు. పాత్రికేయులకు రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇళ్ల స్థలాలను మంజూరు చేయాలని కీర్తన్ డిమాండ్ చేశారు. జర్నలిస్టుల సంక్షేమానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కృషి చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. పాత్రికేయులు దారిద్ర రేఖకు దిగువన నివసిస్తున్నారని వారి సంక్షేమానికి ప్రభుత్వాలు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చేందుకు తమ యూనియన్ ఎల్లప్పుడు పనిచేస్తూ ఉంటుందని కీర్తన్ తెలిపారు. జాప్ విశాఖ విశాఖ ప్రధాన కార్యదర్శి జెవికె అప్పలరాజు మాట్లాడుతూ తమ యూనియన్ నిరంతరం జర్నలిస్టుల సంక్షేమానికి పనిచేస్తూనే ఉంటుందని తెలిపారు. పలు రాష్ట్రాల్లో సీనియర్ జర్నలిస్టులకు పింఛన్ ఇస్తున్నట్లుగా మన రాష్ట్రంలో కూడా ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమంలో జాప్ విశాఖ కార్యవర్గ ప్రతినిధులు,,గంట చంద్రశేఖర్ వి ఉదయ్ కుమార్, జి దానేష్, కే సందీప్ కే పృథ్వీరాజ్ వై.యస్ సాయికుమార్, పి .అర్జున్, ఎస్ రామకృష్ణ, , ఎస్. ఎన్. నాయుడు, ఆర్. శ్రీనివాసరావు, జి రాజు, కే .శంకర్ ,సురేష్, జి సతీష్, జి. శ్రీనివాస్, శ్రీనివాస్, ప్రసాద్, ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా రంగాలకు చెందిన జర్నలిస్టులు, ఫోటో వీడియో జర్నలిస్టులు, యూట్యూబ్ ఛానల్స్ ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.