Wednesday, 30 July 2025
  • Home  
  • జర్నలిస్టులను ఆదుకోవాలని కలెక్టర్ కు జాప్ వినతి
- Featured

జర్నలిస్టులను ఆదుకోవాలని కలెక్టర్ కు జాప్ వినతి

జర్నలిస్టులను ఆదుకోవాలని కలెక్టర్ కు జాప్ వినతి నెల్లూరు : కరోనా లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నెల్లూరు జిల్లాలోని జర్నలిస్టులకు సాయం చేయాలని కోరుతూ జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) నెల్లూరు జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు అందజేయాలని రూరల్ డెవలప్ మెంట్ ట్రస్టు (RDT) అనంతపురం వారిని జాప్ కోరగా, వారు నెల్లూరు నగరంలో ఉన్న ఆ శాఖ ద్వారాఅందించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే జిల్లా కలెక్టర్ ద్వారా అనుమతులు ఇప్పించి, సిఫార్సు చేయించాలని కోరగా,  ఆ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు ను బుధవారం కలెక్టర్ క్యాపు ఆఫీసులో కలవడం జరిగింది. కలెక్టర్ అందుకు సానుకూలంగా స్పందించి, ఈ తంతు పూర్తి చేయాలని డి ఆర్ ఓ ను ఆదేశించారు. డి ఆర్ ఓ ను కూడా కలిసి కలెక్టర్ సిఫారసు లేఖను అందజేయగా ఆయన వెంటనే స్పందించి ఆర్ డి టి సంస్థ తో సంప్రదింపులు జరపడంతో పాటు, సమాచారశాఖ ద్వారా జాబితా కోరారు. జిల్లా జాప్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, జాప్ నాయకులు విజయకుమార్ రెడ్డి,రావూరి రమేష్ పాల్గొన్నారు. అనంతపురం నుండి నెల్లూరు జర్నలిస్టులకు ఈ సహకారం అందించుటకు ప్రధాన పాత్ర పోషించిన jaap రాష్ట్ర నాయకులు అనిల్ కుమార్ రెడ్డి గారికి నెల్లూరు జర్నలిస్టులు అభినందనలు తెలుపుతున్నారు

జర్నలిస్టులను ఆదుకోవాలని కలెక్టర్ కు జాప్ వినతి
నెల్లూరు : కరోనా లాక్ డౌన్ కారణంగా తీవ్ర ఆర్ధిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న నెల్లూరు జిల్లాలోని జర్నలిస్టులకు సాయం చేయాలని కోరుతూ జర్నలిస్టు అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జాప్) నెల్లూరు జిల్లా అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో బుధవారం నెల్లూరు జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేశారు. జర్నలిస్టులకు నిత్యావసర సరుకులు అందజేయాలని రూరల్ డెవలప్ మెంట్ ట్రస్టు (RDT) అనంతపురం వారిని జాప్ కోరగా, వారు నెల్లూరు నగరంలో ఉన్న ఆ శాఖ ద్వారాఅందించేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయితే జిల్లా కలెక్టర్ ద్వారా అనుమతులు ఇప్పించి, సిఫార్సు చేయించాలని కోరగా,  ఆ మేరకు నెల్లూరు జిల్లా కలెక్టర్ శేషగిరి బాబు ను బుధవారం కలెక్టర్ క్యాపు ఆఫీసులో కలవడం జరిగింది. కలెక్టర్ అందుకు సానుకూలంగా స్పందించి, ఈ తంతు పూర్తి చేయాలని డి ఆర్ ఓ ను ఆదేశించారు. డి ఆర్ ఓ ను కూడా కలిసి కలెక్టర్ సిఫారసు లేఖను అందజేయగా ఆయన వెంటనే స్పందించి ఆర్ డి టి సంస్థ తో సంప్రదింపులు జరపడంతో పాటు, సమాచారశాఖ ద్వారా జాబితా కోరారు. జిల్లా జాప్ అధ్యక్షులు వేణుగోపాల్ రెడ్డి, జాప్ నాయకులు విజయకుమార్ రెడ్డి,రావూరి రమేష్ పాల్గొన్నారు.
అనంతపురం నుండి నెల్లూరు జర్నలిస్టులకు ఈ సహకారం అందించుటకు ప్రధాన పాత్ర పోషించిన jaap రాష్ట్ర నాయకులు అనిల్ కుమార్ రెడ్డి గారికి నెల్లూరు జర్నలిస్టులు అభినందనలు తెలుపుతున్నారు

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.