అమరావతి, ఏప్రిల్ (పున్నమి ప్రతినిధి)
రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టుల కోసం కొత్త అక్రిడిటేషన్ జీవోను ఈ నెల 15వ తేది తర్వాత విడుదల చేసే అవకాశం ఉంది. పలు మార్పులతో, పకడ్బందీగా ఈ జీవోను తయారు చేసినట్టు సమాచారం. గతంలో ఉన్న విధానానికి భిన్నంగా, ఈసారి ప్రక్రియను పూర్తిగా డిజిటల్ చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు తెలుస్తోంది.
కొత్త జీవోలో పత్రికా ప్రతినిధుల అర్హతలు, ఫార్మాట్, అవసరమైన డాక్యుమెంట్ల వివరాలు స్పష్టంగా ఉండనున్నాయి. జీవో విడుదలైన వెంటనే, జర్నలిస్టులు ఆన్లైన్‌లో ఫోటోలు, విద్యా ధ్రువీకరణ పత్రాలు, ఆధార్ కార్డు వంటి డాక్యుమెంట్లతో అప్లై చేయాల్సి ఉంటుంది.
ఈ నేపథ్యంలో, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న జర్నలిస్టులు అప్లికేషన్ ప్రక్రియకు సిద్ధంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు. ఇకపై సమగ్ర సమాచారం, పూర్తి స్థాయిలో డాక్యుమెంటేషన్‌తో మాత్రమే అక్రిడిటేషన్ మంజూరు కానుంది.

