పున్నమి Daily న్యూస్
ప్రతినిథి.: T.Ravinder
ఖమ్మం
తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ శాఖామాత్యులు గౌరవనీయులు తుమ్మల నాగేశ్వరరావు గారిని
భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి
శ్రీ నాయుడు రాఘవరావు ప్రశ్నించడం జరిగింది*, *జరా రైతుల గోడును పట్టించుకోండి*. *లక్షల, వేల ఎకరాలలో సాగవుతున్న పామాయిల్ మొక్కలలో కాతకు రాని, పూతకు రాని*, *ఆఫ్ టైప్ మొక్కల గురించి రైతుల గోడును పట్టించుకోగలరు*. *రైతులు ఎంతో ఆనందంతో పామాయిల్ సాగుకు ఉపక్రమించటం జరిగింది*. *కానీ వారి ఆశలు అడియాసలైపోయినట్లుగా ఉంది*. *వాళ్లు సాగు చేస్తున్న భూములలో ఎక్కువ ఆఫ్ టైప్ మొక్కలు ఉండటం జరిగింది*. *టి ఎస్ ఆయిల్ ఫెడ్ నిర్లక్ష్యం అవినీతి వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు* .*ఈ ఆఫ్ టైప్ మొక్కల గురించి రైతులు ఎక్కని ప్రభుత్వ కార్యాలయం లేదు, తిరగని ప్రజాప్రతినిధులు లేరు, తిరగని కోర్టులు లేవు*.
*అయినప్పటికీ వారి సమస్య సమస్యగానే ఉంది*.
*ఐదు, ఆరు సంవత్సరాలు చంటి పిల్లల లాగా పామాయిల్ మొక్కను పెంచిన రైతు కళ్ళల్లో కన్నీళ్లే కనిపిస్తున్నాయి*. *ఎప్పటికీ కాతకు రాదని, గెలలు రావని తెలిసి రైతులు భోరున విలపిస్తూ, లోలోన కుమిలిపోతున్నారు*. *రైతులు ఆఫీసులకు వెళ్ళినప్పుడు తూతూ మంత్రంగా ఎవర్నో కొంతమంది అధికారులను పంపించి సర్వే పేరుతో తత్సారం చేస్తున్నారే తప్ప రైతులకు జరిగిన మేలు శూన్యం*.*ఇవన్నీ తెలవనట్లుగా తెలంగాణ వ్యవసాయ శాఖ వ్యవహారిస్తోంది*. *ఇప్పటికైనా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వానికి రైతుల పట్ల నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే అధికారులను పిలిపించి రైతుల భూములలో సర్వే చేపించి రైతులకు తగు నష్టపరిహారం ఇప్పంచవలసిందిగా కోరుతున్నాము*. *ఈ సమస్య పరిష్కారం కాకపోతే భవిష్యత్తులో భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో, రైతుల తరఫున పామాయిల్ ఆఫ్ టైప్ మొక్కల గురించి పెద్ద ఎత్తున ఆందోళనలు, ఉద్యమాలు నిర్వహించి , రైతులకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తాం అమని బిజెపి బిజెపి జిల్లా కార్యదర్శి
నాయుడు రాఘవరావు డిమాండ్ చేసినారు

