Saturday, 19 July 2025
  • Home  
  • జపాన్ కనెక్ట్ విత్ ఆంధ్రప్రదేశ్’ సెమినార్‌లో శ్రీసిటీ ఎండీ,
- Featured - ఆంధ్రప్రదేశ్

జపాన్ కనెక్ట్ విత్ ఆంధ్రప్రదేశ్’ సెమినార్‌లో శ్రీసిటీ ఎండీ,

జపాన్ కనెక్ట్ విత్ ఆంధ్రప్రదేశ్’ సెమినార్‌లో శ్రీసిటీ ఎండీ, జపాన్ – ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక భాగస్వామ్యం: పెట్టుబడులకు కొత్త అవకాశాలు “జపాన్ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ కీలక గమ్యం” – ‘   శ్రీసిటీ, మార్చి (పున్నమి ప్రతినిధి) భారతదేశంలోని జపాన్ రాయబారి కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఆర్ధికాభివృద్ధి మండలి (ఈ.డి.బి), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్.ఐ.సి.సి.ఐ) సంయుక్తంగా, “పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ప్రజా సంబంధాలు & విద్య” అంశాలపై నిర్వహించిన సెమినార్‌ బుధవారం విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం జపాన్-ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి వేదికగా నిలిచింది. ఈ సదస్సులో భారతదేశంలో జపాన్ రాయబారి ఓనో కెయిచీ, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు & వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డా. రవీంద్ర సన్నారెడ్డి, పాల్గొన్నారు. ఎఫ్.ఐ.సి.సి.ఐ డిప్యూటీ సెక్రటరీ జనరల్ డా. గుణవీనా చద్ధా సమన్వయం చేయగా, విశ్వ సముద్ర హోల్డింగ్స్‌ మేనుఫ్యాక్చరింగ్ సి.ఈ.ఓ జితేంద్ర నిమ్మగడ్డ అతిథులకు స్వాగతం పలికారు. . జపాన్ రాయబారి ఓనో కెయిచీ, భారతదేశంతో జపాన్ వ్యాపార సంబంధాలను ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. జపనీస్ పెట్టుబడులకు శ్రీసిటీ ప్రధాన వేదికగా మారిందని గుర్తు చేశారు. మంత్రి టి.జి. భరత్ పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్-జపాన్ కనెక్ట్ విధానం ద్వారా జపనీస్ కంపెనీలను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యూహాలను మంత్రి భరత్ వివరించారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దార్శనిక నాయకత్వాన్ని ప్రశంసించిన డా. రవీంద్ర సన్నారెడ్డి, జపాన్-భారత సంబంధాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వ్యూహాత్మక నిర్ణయాలను, తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. దక్షత గల నాయకత్వం, విదేశీ పెట్టుబడుల కోసం స్నేహపూర్వక వాతావరణం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక భౌగోళిక స్థానం, మొదలగు కారణాల వల్ల పెట్టుబడులకు రాష్ట్రం కీలక గమ్యంగా మారిందని ఆయన పేర్కొన్నారు. శ్రీసిటీ ప్రస్తుతం భారతదేశంలో రెండో అతిపెద్ద జపనీస్ టౌన్‌షిప్ గా రూపుదిద్దుకున్నదని తెలియజేశారు. ప్రస్తుతం ముప్పై ఒక్క జపనీస్ కంపెనీలు శ్రీసిటీలో అధునాతన ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాయని వివరించారు. నైపుణ్య అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, స్థిరమైన పారిశ్రామికీకరణ వంటి అంశాల్లో శ్రీసిటీ ప్రధాన పాత్ర పోషిస్తోందని, తద్వారా స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు. జపాన్-ఆంధ్రప్రదేశ్ మధ్య పెట్టుబడుల విస్తరణ, ప్రజల మధ్య సంబంధాల అభివృద్ధి, విద్య, మౌలిక సదుపాయాలు, సాంకేతికత రంగాల్లో కొత్త అవకాశాలను అన్వేషించే దిశగా కట్టుబడి ఉన్నట్లు వెల్లడిస్తూ ఈ సదస్సు ముగిసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోని జపాన్ వ్యాపార కేంద్రంగా మరింతగా ఎదుగుతుందని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

జపాన్ కనెక్ట్ విత్ ఆంధ్రప్రదేశ్’ సెమినార్‌లో శ్రీసిటీ ఎండీ,

జపాన్ – ఆంధ్రప్రదేశ్ వ్యూహాత్మక భాగస్వామ్యం: పెట్టుబడులకు కొత్త అవకాశాలు

“జపాన్ పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ కీలక గమ్యం”
– ‘

 

శ్రీసిటీ, మార్చి (పున్నమి ప్రతినిధి)

భారతదేశంలోని జపాన్ రాయబారి కార్యాలయం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ఆర్ధికాభివృద్ధి మండలి (ఈ.డి.బి), ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఛాంబర్స్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీ (ఎఫ్.ఐ.సి.సి.ఐ) సంయుక్తంగా, “పెట్టుబడులు, మౌలిక సదుపాయాలు, ప్రజా సంబంధాలు & విద్య” అంశాలపై నిర్వహించిన సెమినార్‌ బుధవారం విజయవాడలోని నోవాటెల్ హోటల్‌లో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమం జపాన్-ఆంధ్రప్రదేశ్ మధ్య ఆర్థిక, సాంస్కృతిక సంబంధాలను మరింత బలోపేతం చేయడానికి వేదికగా నిలిచింది.

ఈ సదస్సులో భారతదేశంలో జపాన్ రాయబారి ఓనో కెయిచీ, ఆంధ్రప్రదేశ్ పరిశ్రమలు & వాణిజ్యం, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి టి.జి. భరత్, శ్రీసిటీ మేనేజింగ్ డైరెక్టర్ డా. రవీంద్ర సన్నారెడ్డి, పాల్గొన్నారు. ఎఫ్.ఐ.సి.సి.ఐ డిప్యూటీ సెక్రటరీ జనరల్ డా. గుణవీనా చద్ధా సమన్వయం చేయగా, విశ్వ సముద్ర హోల్డింగ్స్‌ మేనుఫ్యాక్చరింగ్ సి.ఈ.ఓ జితేంద్ర నిమ్మగడ్డ అతిథులకు స్వాగతం పలికారు. .
జపాన్ రాయబారి ఓనో కెయిచీ, భారతదేశంతో జపాన్ వ్యాపార సంబంధాలను ప్రోత్సహించడంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ప్రశంసించారు. జపనీస్ పెట్టుబడులకు శ్రీసిటీ ప్రధాన వేదికగా మారిందని గుర్తు చేశారు.
మంత్రి టి.జి. భరత్ పెట్టుబడులు, పారిశ్రామిక అభివృద్ధి, ఆర్థిక సహకారాన్ని మరింతగా పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. ఆంధ్రప్రదేశ్-జపాన్ కనెక్ట్ విధానం ద్వారా జపనీస్ కంపెనీలను ఆకర్షించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న వ్యూహాలను మంత్రి భరత్ వివరించారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి దార్శనిక నాయకత్వాన్ని ప్రశంసించిన డా. రవీంద్ర సన్నారెడ్డి, జపాన్-భారత సంబంధాల బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న వ్యూహాత్మక నిర్ణయాలను, తన ప్రసంగంలో ప్రముఖంగా ప్రస్తావించారు. దక్షత గల నాయకత్వం, విదేశీ పెట్టుబడుల కోసం స్నేహపూర్వక వాతావరణం, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, వ్యూహాత్మక భౌగోళిక స్థానం, మొదలగు కారణాల వల్ల పెట్టుబడులకు రాష్ట్రం కీలక గమ్యంగా మారిందని ఆయన పేర్కొన్నారు. శ్రీసిటీ ప్రస్తుతం భారతదేశంలో రెండో అతిపెద్ద జపనీస్ టౌన్‌షిప్ గా రూపుదిద్దుకున్నదని తెలియజేశారు. ప్రస్తుతం ముప్పై ఒక్క జపనీస్ కంపెనీలు శ్రీసిటీలో అధునాతన ఉత్పత్తి కేంద్రాలను నెలకొల్పాయని వివరించారు. నైపుణ్య అభివృద్ధి, సాంకేతిక పరిజ్ఞాన మార్పిడి, స్థిరమైన పారిశ్రామికీకరణ వంటి అంశాల్లో శ్రీసిటీ ప్రధాన పాత్ర పోషిస్తోందని, తద్వారా స్థానిక ప్రజలకు ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయని చెప్పారు.
జపాన్-ఆంధ్రప్రదేశ్ మధ్య పెట్టుబడుల విస్తరణ, ప్రజల మధ్య సంబంధాల అభివృద్ధి, విద్య, మౌలిక సదుపాయాలు, సాంకేతికత రంగాల్లో కొత్త అవకాశాలను అన్వేషించే దిశగా కట్టుబడి ఉన్నట్లు వెల్లడిస్తూ ఈ సదస్సు ముగిసింది. ఈ క్రమంలో ఆంధ్రప్రదేశ్, భారతదేశంలోని జపాన్ వ్యాపార కేంద్రంగా మరింతగా ఎదుగుతుందని ప్రతినిధులు అభిప్రాయపడ్డారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.