Story highlights
- శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 06: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ఆర్.
- టి.
- సి.
శ్రీకాళహస్తి పున్నమి న్యూస్, మార్చి 06: శ్రీకాళహస్తి పట్టణంలోని స్థానిక ఆర్. టి. సి. బస్టాండ్ కూడలి వద్ద శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానం చైర్మన్, ఉమ్మడి చిత్తూరు జిల్లా జనసేన పార్టీ కార్యదర్శి కొట్టే సాయి ప్రసాద్ ఆధ్వర్యంలో ఉద్యమి జనసేన సభ్యత్వ నమోదు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కొట్టే సాయి ప్రసాద్ పరిసర ప్రాంతాల్లోని దుకాణాలను సందర్శిస్తూ ప్రజలకు జనసేన పార్టీ సిద్ధాంతాలు, పార్టీ లక్ష్యాలు మరియు క్రియాశీలక సభ్యత్వం యొక్క ప్రాముఖ్యతను వివరించి ఆసక్తి చూపిన ప్రజలతో జనసేన సభ్యత్వ నమోదు చేయించారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కుమార్, జయప్రకాష్, మహేష్, గరికపాటి చంద్ర, జానీ భాషా, చిరంజీవి తదితరులు, జనసైనికులు పాల్గొన్నారు.