ముఖ్య అతిథులుగా పాల్గొన్న, మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసులు రెడ్డి, సర్పంచ్ సృజన..!
వింజమూరు: పున్నమి న్యూస్ సెప్టెంబర్ 2 ://///
జనసేన పార్టీ అధినేత,రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు వింజమూరు పట్టణంలోని పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో జనసేన పార్టీ మండల కన్వీనర్ బండారు సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి, ఎంపీడీవో శ్రీనివాసులు రెడ్డి, వింజమూరు సర్పంచ్ నల్లగొండ్ల సృజన హాజరయ్యారు. పుట్టినరోజు కేకును కట్ చేసి పవన్ కళ్యాణ్ గారికి శుభాకాంక్షలు తెలియజేశారు. స్వీట్లు ఒకరికొకరు తినిపించుకున్నారు.పంచాయతీ సిబ్బందికి, ప్లాస్టిక్ బుట్టలను పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జనసేన పార్టీ మండల కన్వీనర్ బండారు సత్యనారాయణ మాట్లాడుతూ, ప్రజల కోసం పుట్టిన నాయకుడు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. ప్రజల శ్రేయస్సు కొరకు పుట్టిన పార్టీ జనసేన అన్నారు. ప్రజా నాయకుడు పవన్ కళ్యాణ్ పార్టీలో పనిచేయడం ఆనందంగా ఉందన్నారు. ఉదయగిరి నియోజకవర్గం కోఆర్డినేటర్ కొట్టే వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో, పవన్ కళ్యాణ్ అడుగుజాడల్లో నడుచుకుంటానన్నారు. ఇలాంటి పుట్టినరోజు లు పవన్ కళ్యాణ్ ఎన్నో జరుపుకోవాలని ఆయన ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు సుఖశాంతులతో ఉండాలని ఆకాంక్షించారు. మండల కన్వీనర్ గూడా నరసారెడ్డి మాట్లాడుతూ జనసేన పార్టీ అధినేత రియల్ హీరో ప్రజా సేవకుడు ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, ప్రజా నాయకుడని ప్రజల పక్షాన ఉండే నేత అని, కూటమి ప్రభుత్వ పాలనలో క్రియాశీలకంగా వ్యవహరిస్తూ, ప్రజా సంక్షేమ వారధిగా, గ్రామ అభివృద్ధి ప్రదాతగా, నిలిచిన నేత అని కొనియాడారు.
ఈ కార్యక్రమంలో మండల ప్రధాన కార్యదర్శి చల్లా శ్రీనివాసులు యాదవ్, సొసైటీ డైరెక్టర్ కోడూరు నాగిరెడ్డి, ఏగినేని శ్రీనివాసులు నాయుడు, గున్నం శ్రీనివాసులు రెడ్డి, పంచాయతీ కార్యదర్శి రామారావు, జనసేన ప్రధాన కార్యదర్శి ఇమ్రాన్, కూరగాయలు రాజా, వెలుగోటి సురేష్,వెంకీ, గవ్వల కిషోర్ జమీర్, పవన్ కళ్యాణ్, సురేష్, పండు, మనోజ్, తదితరులు ఉన్నారు.


