విశాఖపట్నం, అక్టోబర్ 14:
దక్షిణ నియోజకవర్గ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పౌరసరఫరా శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ గారు ముఖ్య అతిథిగా పాల్గొని పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలతో కలిసి విస్తృత స్థాయి సమావేశం జగదాంబ జంక్షన్ అంబికా బాగ్ కళ్యాణ మండపం వద్ద నిర్వహించారు.
నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ –
జనసేన పార్టీలో మహిళలకు ప్రత్యేక గుర్తింపు ఉంటుందని పేర్కొన్నారు. వంశీకృష్ణ శ్రీనివాస్ తన పదవిని వదిలి పార్టీ కోసం అంకితభావంతో పనిచేశారని ఆయన కొనియాడారు.
పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్ వంటి నాయకులు పార్టీ విజయానికి కృషి చేశారని అన్నారు.
జనసేన పార్టీ సేవా కార్యక్రమాలతో ప్రజల్లో విశ్వాసం పొందిందని, పవన్ కళ్యాణ్ నాయకత్వంలో ప్రజా సమస్యలపై ప్రశ్నించే పార్టీగా ఎదిగిందని చెప్పారు.
స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రుల మనోభావాలను ప్రతిబింబిస్తూ కేంద్ర నాయకత్వానికి వివరించారని తెలిపారు.
వైసీపీ దుర్మార్గ పాలనకు వ్యతిరేకంగా పోరాటం చేసి విజయాన్ని సాధించామని, రాష్ట్ర అభివృద్ధి కోసం పెట్టుబడులు, ఉద్యోగావకాశాలు తీసుకురావడమే పవన్ కళ్యాణ్ గారి లక్ష్యమని అన్నారు.
పవన్ కళ్యాణ్ గారు ఎమ్మెల్యేలందరికీ ఐదు నియోజకవర్గాల బాధ్యతలు అప్పగించాలని నిర్ణయించారని, ప్రతి కార్యకర్త క్షేత్రస్థాయిలో పార్టీ కార్యక్రమాలను ప్రజలకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.
వంశీకృష్ణ శ్రీనివాస్ మాట్లాడుతూ –
స్థానిక సంస్థల ఎన్నికలు సమీపిస్తున్నాయని, పార్టీ బలోపేతంపై దృష్టి పెట్టామని తెలిపారు.
కొంతమంది కార్యకర్తలు నామినేటెడ్ పదవులు రాలేదనే అపోహలో ఉన్నారని, సమయం వచ్చినప్పుడు తప్పక గుర్తింపు వస్తుందని అన్నారు.
తాను కూడా 12 సంవత్సరాల నిరీక్షణ తర్వాత విజయాన్ని సాధించానని గుర్తు చేశారు.
కష్టపడిన ప్రతి కార్యకర్తకు జనసేనలో గుర్తింపు లభిస్తుందని నమ్మకం వ్యక్తం చేశారు.
పంచకర్ల రమేష్ బాబు మాట్లాడుతూ –
వైసీపీ దుర్వినియోగ పాలన నుండి రాష్ట్రాన్ని రక్షించాలనే సంకల్పంతో పవన్ కళ్యాణ్ బీజేపీ, తెలుగు దేశం పార్టీలతో కూటమి ఏర్పాటు చేశారని పేర్కొన్నారు.
కార్యకర్తలకు నామినేటెడ్ పదవులు, రానున్న ఎన్నికల అభ్యర్థిత్వాలు న్యాయంగా కేటాయించబడతాయని భరోసా ఇచ్చారు.
వార్డు స్థాయి నుండి పార్టీ బలోపేతం అవసరమని, రాబోయే ఎన్నికల్లో 100 శాతం విజయాలు సాధించేలా కృషి చేయాలని సూచించారు.
కార్యక్రమంలో ఎమ్మెల్యేలు పంచకర్ల రమేష్ బాబు, సుందరపు విజయ్ కుమార్, డిప్యూటీ మేయర్ దల్లి గోవిందరెడ్డి, జనసేన ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంతలక్ష్మి, కందుల నాగరాజు, మహమ్మద్ సాదిక్, ఆళ్ల లీలావతి, ఉషశ్రీ, కామేశ్వరి, సూర్యకుమారి, మేరీ జోన్స్ రాజు, మాజీ ఎమ్మెల్యే ఎస్.ఏ.రెహమాన్, నియోజకవర్గ సమన్వయకర్తలు అంగ దుర్గాప్రసాంతి, పసుపులేటి ఉషాకిరణ్, పి.శివ ప్రసాద్ రెడ్డి, వార్డ్ ప్రెసిడెంట్లు, కార్పొరేషన్ డైరెక్టర్లు, మహిళా కోఆర్డినేటర్లు, వీర మహిళలు, పార్టీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు.


