Story highlights
- అనకాపల్లి జిల్లా కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో అనకాపల్లి పార్లమెంటు పరిధికి చెందిన సమన్వయకర్తలు, 32 మంది సభ్యులతో కూడిన నిర్వాహక్ దళ్ సమన్వయ సమావేశం నిర్వహించారు.
- ఈ సమావేశంలో యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, పీవీఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు.
- ఈ సందర్భంగా నిర్వాహక్ దళ్ సభ్యుల మధ్య సమన్వయం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చించారు.
అనకాపల్లి జిల్లా కేంద్రంలోని జనసేన పార్టీ కార్యాలయంలో అనకాపల్లి పార్లమెంటు పరిధికి చెందిన సమన్వయకర్తలు, 32 మంది సభ్యులతో కూడిన నిర్వాహక్ దళ్ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో యలమంచిలి నియోజకవర్గ ఎమ్మెల్యే సుందరపు విజయ్ కుమార్, అనకాపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే కొణతాల రామకృష్ణ, పీవీఎస్ఎన్ రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా నిర్వాహక్ దళ్ సభ్యుల మధ్య సమన్వయం, పార్టీ కార్యక్రమాల నిర్వహణ, క్షేత్రస్థాయిలో నాయకులు, కార్యకర్తల భాగస్వామ్యం వంటి అంశాలపై చర్చించారు. పార్టీ కార్యక్రమాలను సమర్థవంతంగా ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు సమన్వయంతో పనిచేయాల్సిన ఆవశ్యకతను నాయకులు వివరించారు. ఈ సమావేశంలో పలువురు పార్టీ నాయకులు, సమన్వయకర్తలు పాల్గొన్నారు.