జనవరి 26వ తారీకున గణతంత్ర దినోత్సవ వేడుకల్లో ప్రతి పాఠశాల యందు విద్యార్థుల ముందు భారత రాజ్యాంగాన్ని ప్రదర్శించాలి
భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ అంబేద్కర్ గారి చిత్రపటాన్ని ప్రతి పాఠశాల యందు ప్రభుత్వ కార్యాలయంలో పెట్టుట తప్పనిసరి చేయాలి
జిల్లా కలెక్టర్ సంతోష్ గారికి వినతి పత్రం ఇచ్చిన భీమ్ ఆర్మీ నాయకులు
భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జి మాచర్ల ప్రకాష్
భీమ్ ఆర్మీ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు మేళ్లచెరువు వర్షిత్
జోగులాంబ గద్వాల జిల్లాలో జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం వేడుకల్లో ప్రతి పాఠశాల యందు ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో భారత రాజ్యాంగాన్ని ప్రదర్శించాలి మరియు భారత రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ భీమ్ రావు అంబేద్కర్ గారి చిత్రపటాన్ని తప్పనిసరి పెట్టుట చేయాలనీ భీమ్ ఆర్మీ ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ఇన్చార్జ్ మాచర్ల ప్రకాష్ గారు జిల్లా అధ్యక్షులు వర్షిత్ గారు జిల్లా కలెక్టర్ గారు సంతోష్ గారిని వినతిపత్రం అందజేశారు సందర్భంగా జిల్లా కలెక్టర్ గారు తప్పనిసరిగా చర్య తీసుకుంటామని అన్నారు


