Thursday, 5 February 2026
  • Home  
  • జనవరి 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’ – సీ టు స్కై కాన్సెప్ట్‌తో 9 రోజుల పర్యాటక వేడుకలు
- విశాఖపట్నం

జనవరి 24 నుంచి ‘విశాఖ ఉత్సవం’ – సీ టు స్కై కాన్సెప్ట్‌తో 9 రోజుల పర్యాటక వేడుకలు

విశాఖపట్నం (పున్నమి ప్రతినిధి): ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ‘విశాఖ ఉత్సవం’ నిర్వహించనున్నారు. ‘సీ టు స్కై’ కాన్సెప్ట్‌తో విశాఖ, అనకాపల్లి, అరకు లోయలను కేంద్రంగా చేసుకుని మొత్తం 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. విశాఖ నగరంలో జనవరి 24 నుంచి 31 వరకు, అనకాపల్లి ప్రాంతంలో జనవరి 29, 30 తేదీల్లో, అరకు లోయలో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉత్సవాలకు దాదాపు 10 లక్షల మంది సందర్శకులు హాజరవుతారని అంచనా వేస్తుండగా, దాదాపు 3 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 1800 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆహారోత్సవాలు, సాహస క్రీడలు, కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

విశాఖపట్నం (పున్నమి ప్రతినిధి):

ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ‘విశాఖ ఉత్సవం’ నిర్వహించనున్నారు. ‘సీ టు స్కై’ కాన్సెప్ట్‌తో విశాఖ, అనకాపల్లి, అరకు లోయలను కేంద్రంగా చేసుకుని మొత్తం 9 రోజుల పాటు ఈ ఉత్సవాలు జరగనున్నాయి. విశాఖ నగరంలో జనవరి 24 నుంచి 31 వరకు, అనకాపల్లి ప్రాంతంలో జనవరి 29, 30 తేదీల్లో, అరకు లోయలో జనవరి 30 నుంచి ఫిబ్రవరి 1 వరకు కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ ఉత్సవాలకు దాదాపు 10 లక్షల మంది సందర్శకులు హాజరవుతారని అంచనా వేస్తుండగా, దాదాపు 3 వేల మందికి ప్రత్యక్షంగా, మరో 1800 మందికి పరోక్షంగా ఉపాధి అవకాశాలు లభించనున్నట్లు తెలిపారు. పర్యాటకాన్ని ప్రోత్సహించడమే లక్ష్యంగా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆహారోత్సవాలు, సాహస క్రీడలు, కళా ప్రదర్శనలు నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.