*జనరల్ బోగీలు పెంచాలి*
*కిక్కిరిసి పోతున్న జనరల్ బోగీలు*
*కొని రైళ్ళ లో జనరల్ బోగీలు తక్కువగా ఉండడం వలన రిజర్వేషన్ బోగీల్లో ప్రయాణిస్తున్న జనరల్ భోగి ప్రయాణికులు*
*విశాఖపట్నం,నవంబర్ పున్నమి ప్రతినిధి*
విశాఖ నుంచి విశాఖ మీదుగా ప్రయాణించే రైళ్లలో తగినన్ని జనరల్ కోచ్లు లేకపోవడం వలన తమంత ఇబ్బందులు పడుతున్నాం అని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు,,గోదావరి ఎక్స్ప్రెస్ లో రద్దీ ఎక్కువగా ఉన్నప్పటికీ ముందు ఒక జెనరలు కోచ్ వెనుక ఒక జనరల్ కోచ్ మాత్రమే పెడుతున్నారని దీని వలన తమకు ఎంతో ఇబ్బంది గా ఉంటుందని బాగా కిక్కిరిసి పోయి ఉంటుందని ఇంచు మించు సికింద్రాబాద్ స్టేషన్ వరకు రిటర్న్ చూసుకుంటే అనకాపల్లి దువ్వాడ స్టేషన్ వరకు ఇదే పరిస్థితి వుంటుంది అని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు,,విశాఖపట్నం తిరుపతి , కోర్బా ఎక్స్ప్రెస్ లో కూడా తిరుపతి వైపుగా ప్రయాణించేటప్పుడు జనరల్ కోచ్లు సరిపోవడం లేదని దీని ఫలితంగా రిజ్వేషన్ కోచ్లను ఆశ్రయించాల్సి వస్తుందనీ టి టి లు తమకు ఫైన్ లు విధిస్తున్నారు అని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు,,గుంటూరు రాయగడ ఎక్స్ప్రెస్ లో కూడా ఇదే పరిస్థితి ఉందని జనరల్ కోచ్ల సంఖ్య పెంచలనీ పలువురు ప్రయాణికులు చెబుతున్నారు,,విశాఖపట్నం విజయవాడ,విజయవాడ విశాఖపట్నం ఉదయ్ డబుల్ డెక్కర్ ట్రైన్ కు జనరల్ కోచ్ లను కేటాయించాలని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు,, కన్యాకుమారి దిబ్రుఘాడ సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకు 10వరకు జనరల్ బోగీలు ను కేటాయించలని తగినన్ని జనరల కోచ్లు లేకపోవడం మొత్తం రైలు స్లీపర్ కోచ్లు తో సహా కిక్కిరిసిన ప్రయాణికులు తో తీవ్ర ఇబ్బందులు పడుతూ తాము ప్రయాణాలు చేస్తున్నాము అని ముఖ్యం గా మహిళా ప్రయాణికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు అని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు,,ఇప్పటికైనా రైల్వే శాఖ మరియు మన నాయకులు స్పందించి తగినన్ని జనరల్ కోచ్ లను ఏర్పాటు చేయిస్తారని తాము ఆశిస్తున్నాము అని పలువురు ప్రయాణికులు చెబుతున్నారు,


