దివ్యాంగ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సంఘం:
జనగామ, నవంబర్29,పున్నమి న్యూస్:
దివ్యాంగ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమ సంఘం జనగామ జిల్లాశాఖ మొట్టమొదటి సమావేశం సీనియర్ ఉపాధ్యాయుడు అంబటి అంజయ్య గారి అధ్యక్షతన ప్రాధమిక పాఠశాల జనగామ రైల్వే స్టేషన్ (పండ్లబడి) ఆవరలో నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి హన్మకొండ, వరంగల్ జిల్లాల ఉమ్మడి అధ్యక్షులు బిల్లమహేందర్ గారు, రాష్ట్రకమిట్ సభులు శ్రీమతి నర్సమ్మగారు పాల్గున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దివ్యాంగులమైన మనము ఆత్మస్థైరము, గుండె నిబ్బరము, అంకెత భావము, ఆత్మగౌరవము తో పనిచేసి సకలాంగులకంటే మనము దేనిలో తక్కువ కాదని, అన్నిరంగాలను ముందుంటే విదంగా పనిచేయాలని కోరారు. మనము చేసే పనిలో నైపుణము తో పనిచేసి అద్భుతమైన పలితాలకోసం కృషి చేయాలని, కోరారు. ఆతరువాత జనగామ జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.
దివ్యాంగ ఉద్యోగ ఉపాధ్యాయ సంక్షేమసంఘం జనగామ జిల్లా శాఖ
గౌరవ సలహాదారులు :- శ్రీ అంబటి అంజయ్య గారు .
అధ్యక్షులు:- సయ్యద్ మునవర్ పాషా గారు .
కారు నిర్వహక అధ్యక్షులు–అనుముల కుమార్ గారు
( ప్రధాన కార్యదర్శి – శ్రీ కొలిపాక యాదగిరి గారు
కోశాదికారి :- K – సుదాకర్ గారు.
(ప్రచార కార్యదర్శులు :- 1, బృంగి కార్తీక్, బిట్ల వేణుకుమార్ ఉపాధ్యక్షులు, -1, కృష్ణవేణి , విజయపాల్ రెడ్డి , యాదగిరి
కార్యదర్శులు :- 1, నర్సింహులు, శ్రీనివాస్, రాధిక, సరిత.
కార్యవర్గసభ్యులు:– కుమారస్వామి, శ్రీధర్, ఉపేందర్, కనకరాజ్-
ఎన్నికల పరిశీలకులుగా బిల్లమహేంధర్, నరసింహ గార్లు వ్యవహరించారు –


