Wednesday, 25 March 2026
  • Home  
  • జనగామ జిల్లా డిసిసి అధ్యక్షుడి ఎన్నికకు కసరత్తు:ఏఐసిసి,టిపిసిసిఅబ్జర్వర్లు
- జనగాం

జనగామ జిల్లా డిసిసి అధ్యక్షుడి ఎన్నికకు కసరత్తు:ఏఐసిసి,టిపిసిసిఅబ్జర్వర్లు

డిసిసి అధ్యక్షుడి ఎన్నికకు కసరత్తు శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకుంటున్న అబ్జర్వర్లు —————————————- జనగామ, అక్టోబర్11,పున్నమి న్యూస్: సంఘటన్ సృజన్ అభియాన్ – తెలంగాణ కార్యక్రమం థీమ్‌తో టీపీసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా శాఖ అధ్యక్షులు ఎన్నిక కోసం అధిష్టానం శనివారం కసరత్తును ప్రారంభించింది. అందులో భాగంగా డిసిసి అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ అబ్జర్వర్ దేబాసిస్ పట్నాయక్, టీపీసీసీ అబ్జర్వర్లు ఎమ్మెల్యే శంకరయ్య, ఎం.డి.అవేజ్, శ్రీకాంత్ యాదవ్, జువ్వాడి ఇంద్ర పాల్గొని దరఖాస్తు ఫారం ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అబ్జర్వర్లు మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన నాయకత్వాన్ని ప్రజల ద్వారానే ఎంపిక చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ స్ఫూర్తితో ఏఐసీసీ అబ్జర్వర్లు తెలంగాణలోని ప్రతి జిల్లాలో నాయకులతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలను సేకరిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్ష పదవికి ఆసక్తి గల ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రతి నాయకుడితో తాము వ్యక్తిగతంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుంటామని తెలిపారు. సేకరించిన సమాచారాన్ని టీపీసీసీ, ఏఐసీసీకి నివేదిస్తామన్నారు. ప్రస్తుత జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కూడా అధికారికంగా తన దరఖాస్తును ఏఐసీసీ, టీపీసీసీ అబ్జర్వర్లకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు గ్రంథాలయ చేర్మన్ మారోజు రాంబాబు,వ్యవసాయ మార్కెట్ చేర్మన్ బంక శివరాజ్ యాదవ్, మండల, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

డిసిసి అధ్యక్షుడి ఎన్నికకు కసరత్తు
శ్రేణుల అభిప్రాయాలు తెలుసుకుంటున్న అబ్జర్వర్లు
—————————————-
జనగామ, అక్టోబర్11,పున్నమి న్యూస్:
సంఘటన్ సృజన్ అభియాన్ – తెలంగాణ కార్యక్రమం థీమ్‌తో టీపీసీసీ ఆదేశాల మేరకు కాంగ్రెస్ పార్టీ జనగామ జిల్లా శాఖ అధ్యక్షులు ఎన్నిక కోసం అధిష్టానం శనివారం కసరత్తును ప్రారంభించింది. అందులో భాగంగా డిసిసి అధ్యక్షులు మాజీ శాసనసభ్యులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ఏఐసీసీ అబ్జర్వర్ దేబాసిస్ పట్నాయక్, టీపీసీసీ అబ్జర్వర్లు ఎమ్మెల్యే శంకరయ్య, ఎం.డి.అవేజ్, శ్రీకాంత్ యాదవ్, జువ్వాడి ఇంద్ర పాల్గొని దరఖాస్తు ఫారం ను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో అబ్జర్వర్లు మాట్లాడుతూ ప్రజల నుండి వచ్చిన నాయకత్వాన్ని ప్రజల ద్వారానే ఎంపిక చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం అన్నారు. ఈ స్ఫూర్తితో ఏఐసీసీ అబ్జర్వర్లు తెలంగాణలోని ప్రతి జిల్లాలో నాయకులతో నేరుగా మాట్లాడి అభిప్రాయాలను సేకరిస్తున్నారని చెప్పారు. కాంగ్రెస్ కమిటీ జిల్లా అధ్యక్ష పదవికి ఆసక్తి గల ఎవరైనా దరఖాస్తు చేసుకోవచ్చని, ప్రతి నాయకుడితో తాము వ్యక్తిగతంగా మాట్లాడి వారి అభిప్రాయాలను తెలుసుకుంటామని తెలిపారు. సేకరించిన సమాచారాన్ని టీపీసీసీ, ఏఐసీసీకి నివేదిస్తామన్నారు. ప్రస్తుత జనగామ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు కొమ్మూరి ప్రతాప్ రెడ్డి కూడా అధికారికంగా తన దరఖాస్తును ఏఐసీసీ, టీపీసీసీ అబ్జర్వర్లకు సమర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని ముఖ్య నాయకులు గ్రంథాలయ చేర్మన్ మారోజు రాంబాబు,వ్యవసాయ మార్కెట్ చేర్మన్ బంక శివరాజ్ యాదవ్, మండల, పట్టణ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు, అనుబంధ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.