నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి )
జనగణన కార్యక్రమంలో భాగంగా తిప్పర్తి మండలం లో నిర్వహించనున్న 2027 జనగణన ముందస్తు కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ లను ఆదేశించారు. 2027 జనాభా లెక్కల సేకరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో ముందస్తు గణన కార్యక్రమాన్ని పైలట్ పద్ధతిలో చేపట్టేందుకు ఎంపిక చేయగా పట్టణ ప్రాంతంలో జిహెచ్ఎంసి, గ్రామీణ ప్రాంతాల్లో నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం, గిరిజన ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయి. ఇందులో భాగంగా తిప్పర్తి మండలం లోని మామిడాల, ఇండ్లూరు, సర్వారం, తిప్పర్తి, జంగారెడ్డిగూడెంలలో జనగణన చేయనున్నారు. తిప్పర్తి రైతు వేదికలో ఆదివారం నుండి మూడు రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మొదటిసారిగా డిజిటల్ పద్ధతిలో జనగణన నిర్వహిస్తున్నందున ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహించాలని క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు వస్తే రాష్ట్రస్థాయికి ఈ సమస్యలను తీసుకువెళ్లడం ద్వారా సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు.
ఈ ముందస్తు జనగణన కార్యక్రమంలో భాగంగా ఈనెల 10 నుండి 15 వరకు పైన పేర్కొన్న ఐదు గ్రామాలలో ఎన్యుమరేటర్లు, ఇండ్లకు వెళ్లి మొబైల్ యాప్ లో ఇండ్లను మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. అనంతరం ఈనెల 15 నుండి 30 వరకు ఇంటింటికి వెళ్లి నిర్దేశించిన ప్రొఫార్మాలో డిజిటల్ విధానంలో జనాభా లెక్కలను పూర్తి వివరాలతో సేకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రాష్ట్ర గణాంక శాఖ జెడి లాజరస్, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, తహసిల్దార్ రామకృష్ణ తదితరులు ఉన్నారు.

జనగణన ముందస్తు కార్యక్రమం ను తిప్పర్తి మండలంలో నిర్వహించిన : జిల్లా కలెక్టర్
నకిరేకల్ :నవంబర్ ( పున్నమి ప్రతినిధి ) జనగణన కార్యక్రమంలో భాగంగా తిప్పర్తి మండలం లో నిర్వహించనున్న 2027 జనగణన ముందస్తు కార్యక్రమాన్ని జాగ్రత్తగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్ లను ఆదేశించారు. 2027 జనాభా లెక్కల సేకరణలో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో ముందస్తు గణన కార్యక్రమాన్ని పైలట్ పద్ధతిలో చేపట్టేందుకు ఎంపిక చేయగా పట్టణ ప్రాంతంలో జిహెచ్ఎంసి, గ్రామీణ ప్రాంతాల్లో నల్గొండ జిల్లాలోని తిప్పర్తి మండలం, గిరిజన ప్రాంతంలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలు ఉన్నాయి. ఇందులో భాగంగా తిప్పర్తి మండలం లోని మామిడాల, ఇండ్లూరు, సర్వారం, తిప్పర్తి, జంగారెడ్డిగూడెంలలో జనగణన చేయనున్నారు. తిప్పర్తి రైతు వేదికలో ఆదివారం నుండి మూడు రోజులపాటు నిర్వహించే శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ఆదివారం ప్రారంభించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ మొదటిసారిగా డిజిటల్ పద్ధతిలో జనగణన నిర్వహిస్తున్నందున ఎలాంటి తప్పులు లేకుండా నిర్వహించాలని క్షేత్రస్థాయిలో ఏవైనా సమస్యలు వస్తే రాష్ట్రస్థాయికి ఈ సమస్యలను తీసుకువెళ్లడం ద్వారా సరిచేసుకునేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ ముందస్తు జనగణన కార్యక్రమంలో భాగంగా ఈనెల 10 నుండి 15 వరకు పైన పేర్కొన్న ఐదు గ్రామాలలో ఎన్యుమరేటర్లు, ఇండ్లకు వెళ్లి మొబైల్ యాప్ లో ఇండ్లను మ్యాపింగ్ చేయడం జరుగుతుంది. అనంతరం ఈనెల 15 నుండి 30 వరకు ఇంటింటికి వెళ్లి నిర్దేశించిన ప్రొఫార్మాలో డిజిటల్ విధానంలో జనాభా లెక్కలను పూర్తి వివరాలతో సేకరించడం జరుగుతుంది. ఈ కార్యక్రమం లో మిర్యాలగూడ సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, రాష్ట్ర గణాంక శాఖ జెడి లాజరస్, నల్గొండ ఆర్డీవో వై. అశోక్ రెడ్డి, తహసిల్దార్ రామకృష్ణ తదితరులు ఉన్నారు.

