తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్సేన్ సాగర్ తీరాన నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులకు ఆకస్మికంగా సర్ప్రైజ్ ఇచ్చారు. ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుని నేరుగా కార్యక్రమాన్ని సందర్శించారు.
నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీఎం, అధికారులను అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలని, లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆయనను చూసిన ప్రజలు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. అనేక మంది ఫోటోలు, వీడియోలు తీసేందుకు ముందుకు వచ్చారు.
సీఎం ఆకస్మికంగా వచ్చిన ఘటనతో నిమజ్జన వేడుకకు ప్రత్యేక ఉత్సాహం చేకూరింది.

జనంలోకి సడన్ ఎంట్రీ..
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హుస్సేన్ సాగర్ తీరాన నిమజ్జన కార్యక్రమంలో పాల్గొంటున్న భక్తులకు ఆకస్మికంగా సర్ప్రైజ్ ఇచ్చారు. ఎలాంటి ట్రాఫిక్ క్లియరెన్స్ లేకుండా, ముందస్తు సమాచారం ఇవ్వకుండా, ఎన్టీఆర్ మార్గ్‌కు చేరుకుని నేరుగా కార్యక్రమాన్ని సందర్శించారు. నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన సీఎం, అధికారులను అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నారు. భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు ఉండాలని, లోటుపాట్లు లేకుండా చూడాలని ఆదేశించారు. ఆయనను చూసిన ప్రజలు ఉత్సాహంగా కేరింతలు కొట్టారు. అనేక మంది ఫోటోలు, వీడియోలు తీసేందుకు ముందుకు వచ్చారు. సీఎం ఆకస్మికంగా వచ్చిన ఘటనతో నిమజ్జన వేడుకకు ప్రత్యేక ఉత్సాహం చేకూరింది.

