ఆగస్టు 29, పున్నమి ప్రతినిధి, జనగాం:
జడ్.పి.హెచ్.ఎస్. ఏడునూతుల పాఠశాలలో విద్యార్థుల్లో క్రీడాస్ఫూర్తి, భాషా గౌరవం పెంపొందించేందుకు జాతీయ క్రీడా దినోత్సవం మరియు తెలుగు భాషా దినోత్సవంలను ఘనంగా నిర్వహించారు.
హాకీ దిగ్గజం మేజర్ ధ్యాన్‌చంద్ జయంతి సందర్భంగా జరిపిన జాతీయ క్రీడా దినోత్సవానికి ఫిజికల్ డైరెక్టర్ శ్రీమతి జి. రజిత ఆధ్వర్యం వహించారు. క్రీడలు క్రమశిక్షణ, ఆరోగ్యం, ఐక్యతకు ప్రతీకలని ఆమె వివరించారు.
ప్రధానోపాధ్యాయులు శ్రీ నారబోయిన యాకయ్య విద్యార్థులకు ప్రసంగిస్తూ ధ్యాన్‌చంద్ జీవితం అంకితభావానికి, పట్టుదలకు చిహ్నమని, అదే ఆత్మబలం విద్యార్థులు సొంతం చేసుకోవాలని ప్రేరేపించారు.
అదే విధంగా తెలుగు భాషా దినోత్సవంను తెలుగు ఉపాధ్యాయురాలు శ్రీమతి ఎం. రజిత ఆధ్వర్యంలో జరిపారు. ఆమె ప్రసంగిస్తూ: “తెలుగు భాష మన ఆత్మ, మన గౌరవం, మన సంస్కృతి. ఈ భాషను సజీవంగా ఉంచడం మన అందరి బాధ్యత” అని విద్యార్థులకు ప్రేరణనిచ్చారు.
ఈ కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు కమల్‌కుమార్, రాంబాబు, సోమేశ్వర్, భాస్కర్, యాదగిరి, మమత, విజయ, ఈర్య, కవిత పాల్గొని విద్యార్థులను ఉత్సాహపరిచారు


