ఎస్పీఎస్ఆర్ నెల్లూరు జిల్లా ఫిబ్రవరి (పున్నమి ప్రతినిధి). మనుబోలు మండల కేంద్రంలోని జడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం C. V. Raman ఆవిష్కరించిన రామన్ ఎఫెక్ట్ను స్మరించుకుంటూ నేషనల్ సైన్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు శాస్త్రవేత్తల జీవిత విశేషాలను వివరించగా, సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. అనంతరం సైన్స్ ఫెయిర్ నిర్వహించి విద్యార్థుల తయారు చేసిన ఎగ్జిబిట్లను ప్రదర్శించారు. ఉత్తమ ప్రదర్శనలకు బహుమతులు, సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు అమూల్య కుమారి, ఉపాధ్యాయులు మాధవరావు, కామేశ్వరి, జ్యోతిలక్ష్మి, మంజువాణి, శ్యామల, కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు.

జడ్పీ బాలుర పాఠశాలలో నేషనల్ సైన్స్ దినోత్సవం ఘనంగా నిర్వహణ