Story highlights
- పామూరు, నవంబర్ 3(పున్నమి న్యూస్ రిపోర్టర్ ) వై.
- యస్.
- ఆర్.
పామూరు, నవంబర్ 3(పున్నమి న్యూస్ రిపోర్టర్ ) వై. యస్. ఆర్. సీపీ పార్టీ బలపరిచిన జడ్పీటీసి అభ్యర్థిగా శ్రీమతి అంబటి వెంకట సుబ్బమ్మ పోటీ చేయుచున్న విషయం, మండల స్థాయి ప్రజలందరికి తెలిసిన విషయం.. జడ్పీటీసి అభ్యర్థి గెలుపే ప్రధాన ఉద్దేశంగా సాగిన, ప్రచార కార్యక్రమంలో కనిగిరి నియోజకవర్గ ముస్లిం మైనారిటీ అధ్యక్షులు గాయాజ్ షైక్ మాట్లాడుతూ, జగన్ మోహన్ రెడ్డి పరిపాలనలో చేసిన ప్రజా సంక్షేమ పధకాల అమలు గురించి ఓటర్లకు వివరించారు.. ఈ మండల స్థాయి ప్రచార కార్యక్రమం మాజీ ఎంపీపీ గంగసాని లక్ష్మి ఆధ్వర్యంలో జరిగింది.. కార్యక్రమం లో,వైసీపీ పార్టీ మండల అధ్యక్షులు గంగసాని హుస్సేన్ రెడ్డి, నియోజకవర్గ ముస్లిం మైనారిటీ నాయకులు షైక్. గాయాజ్, పార్టీ ఇర్రి కృష్ణ రెడ్డి, షైక్. బారాషరీఫ్,మాజీ ఎంపీటీసీ అబ్దుల్ షైక్,సీనియర్ పార్టీ నాయకులు మానం ప్రసాద్,జిల్లా నాయకులు చప్పిడి సుబ్బయ్య పాల్గొని కార్యక్రమం విజయవంతం చేశారు..