Wednesday, 11 February 2026
  • Home  
  • జడ్‌పిహెచ్‌ఎస్ ఎడునూతలలో బతుకమ్మ – దసరా పండుగల సంబరాలు
- జనగాం

జడ్‌పిహెచ్‌ఎస్ ఎడునూతలలో బతుకమ్మ – దసరా పండుగల సంబరాలు

జనగాం, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) జడ్‌పిహెచ్‌ఎస్ ఎడునూతలలో బతుకమ్మ, దసరా పండుగలను విద్యార్థులు ఉత్సాహంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. బాలికలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించగా, బాలురు రావణాసురుని విగ్రహాన్ని రూపొందించి దసరా సందేశాన్ని ప్రతిబింబించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు బతుకమ్మ పాటలు, నృత్యాలు, కథా రూపకాలు, వక్తృత్వం, కవితా పఠనం ప్రదర్శించారు.ప్రధానోపాధ్యాయులు నారబోయిన యాకయ్య మాట్లాడుతూ: “బతుకమ్మ పూల పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తే, దసరా సత్యం, న్యాయం సాధించిన విజయానికి ప్రతీక” అని అన్నారు. ఇలాంటి వేడుకలు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఐక్యత పెంపొందిస్తాయని సూచించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమల్‌కుమార్, రాంబాబు, ఈర్య, మమత, సోమేశ్వర్, జి.రజిత, ఎం.రజిత, యాదగిరి, విజయ, కవిత, భాస్కర్, విజయశ్రీ పాల్గొని విద్యార్థులను అభినందించారు.

జనగాం, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)

జడ్‌పిహెచ్‌ఎస్ ఎడునూతలలో బతుకమ్మ, దసరా పండుగలను విద్యార్థులు ఉత్సాహంగా, సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. బాలికలు రంగురంగుల పూలతో బతుకమ్మలను అలంకరించగా, బాలురు రావణాసురుని విగ్రహాన్ని రూపొందించి దసరా సందేశాన్ని ప్రతిబింబించారు. ఈ సందర్భంగా సాంస్కృతిక కార్యక్రమాల్లో విద్యార్థులు బతుకమ్మ పాటలు, నృత్యాలు, కథా రూపకాలు, వక్తృత్వం, కవితా పఠనం ప్రదర్శించారు.ప్రధానోపాధ్యాయులు నారబోయిన యాకయ్య మాట్లాడుతూ: “బతుకమ్మ పూల పండుగ తెలంగాణ ఆత్మను ప్రతిబింబిస్తే, దసరా సత్యం, న్యాయం సాధించిన విజయానికి ప్రతీక” అని అన్నారు. ఇలాంటి వేడుకలు విద్యార్థుల్లో సృజనాత్మకత, ఐక్యత పెంపొందిస్తాయని సూచించారు.కార్యక్రమంలో ఉపాధ్యాయులు కమల్‌కుమార్, రాంబాబు, ఈర్య, మమత, సోమేశ్వర్, జి.రజిత, ఎం.రజిత, యాదగిరి, విజయ, కవిత, భాస్కర్, విజయశ్రీ పాల్గొని విద్యార్థులను అభినందించారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.