యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)
భువనగిరి పట్టణం జగ్దేవ్ పూర్ రోడ్డు విస్తరణ పనులను ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి గారు పరిశీలించారు. అడిషనల్ కలెక్టర్ భాస్కర్ రావు, మున్సిపల్ కమీషనర్ రామలింగం, మున్సిపల్ డిఈ, ఇతర అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఎమ్మెల్యే మాట్లాడుతూ, రోడ్డు ప్రమాదాలు, ట్రాఫిక్ జామ్‌లను తగ్గించడానికి విస్తరణ అవసరం ఉందని చెప్పారు. షాప్‌లు నిర్మాణం కోసం అంగీకారం, జీవనోపాధి కోల్పోకుండా ప్రస్తుత షాప్‌లు అలాగే ఉంచుతామని తెలిపారు. కాంక్రీటింగ్, బీటీ, డ్రెయిన్, ఫుట్ పాత్ వంటి ఆధునిక సదుపాయాలు ఏర్పాటు చేస్తామని చెప్పారు. భువనగిరి సుందరీకరణ కోసం ప్రతి రోడ్డు విస్తరణ ముఖ్యమని గుర్తించారు.


