Monday, 30 March 2026
  • Home  
  • జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్‌కు నూతన పాలకవర్గం చైర్మన్‌గా మల్లెల సీతమ్మ, వైస్ చైర్మన్‌గా అడుసుమల్లి ప్రభాకర్
- ఎన్ టి ఆర్ జిల్లా

జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్‌కు నూతన పాలకవర్గం చైర్మన్‌గా మల్లెల సీతమ్మ, వైస్ చైర్మన్‌గా అడుసుమల్లి ప్రభాకర్

జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు నూతన పాలకవర్గం ఏర్పడింది. పట్టణం విలియంపేటకు చెందిన మల్లెల సీతమ్మ (W/o మల్లెల కొండయ్య)ని చైర్మన్‌గా, మండలం బండిపాలెం గ్రామానికి చెందిన అడుసుమల్లి ప్రభాకర్ ని వైస్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జగ్గయ్యపేటలోని నెట్టెం రఘురాం నివాసంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా మార్కెట్ యార్డులు పనిచేయాలని, రైతులకు న్యాయమైన ధరలు కల్పించడం, పారదర్శక లావాదేవీలు నిర్వహించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నూతన పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు. జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి దళితులకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నెట్టెం రఘురాం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు నెట్టెం శివరామ్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్‌, వైస్ చైర్మన్‌ మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సమావేశంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మేక వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణ సొసైటీ అధ్యక్షుడు ధూళిపాళ్ల లక్ష్మణరావు, కౌన్సిలర్ మారేపల్లి సౌరి తదితరులు పాల్గొన్నారు.

జగ్గయ్యపేట వ్యవసాయ మార్కెట్ యార్డ్‌కు నూతన పాలకవర్గం ఏర్పడింది. పట్టణం విలియంపేటకు చెందిన మల్లెల సీతమ్మ (W/o మల్లెల కొండయ్య)ని చైర్మన్‌గా, మండలం బండిపాలెం గ్రామానికి చెందిన అడుసుమల్లి ప్రభాకర్ ని వైస్ చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం జగ్గయ్యపేటలోని నెట్టెం రఘురాం నివాసంలో వ్యవసాయ మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నెట్టెం రఘురాం మాట్లాడుతూ రైతుల సంక్షేమమే లక్ష్యంగా మార్కెట్ యార్డులు పనిచేయాలని, రైతులకు న్యాయమైన ధరలు కల్పించడం, పారదర్శక లావాదేవీలు నిర్వహించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధిపై నూతన పాలకవర్గం ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మార్కెట్ యార్డ్ అభివృద్ధికి తమ వంతు పూర్తి సహకారం ఎప్పుడూ ఉంటుందని తెలిపారు.
జగ్గయ్యపేట మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవికి దళితులకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు నెట్టెం రఘురాం ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో జగ్గయ్యపేట నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సమన్వయ కమిటీ సభ్యులు నెట్టెం శివరామ్ నూతనంగా బాధ్యతలు చేపట్టిన చైర్మన్‌, వైస్ చైర్మన్‌ మరియు డైరెక్టర్లకు శుభాకాంక్షలు తెలియజేశారు.
ఈ సమావేశంలో పట్టణ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు మేక వెంకటేశ్వర్లు, గోపాలకృష్ణ సొసైటీ అధ్యక్షుడు ధూళిపాళ్ల లక్ష్మణరావు, కౌన్సిలర్ మారేపల్లి సౌరి తదితరులు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.