జగ్గంపేట, సెప్టెంబర్ , (పున్నమి ప్రతినిధి)
స్థానిక ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఘనంగా విష్ణు సహస్రనామ పారాయణం నిర్వహించబడింది. జన్మనక్షత్రం సందర్భంగా గోవింద విష్ణు సహస్రనామం 27 సార్లు నక్షత్రమాలుగా పారాయణం చేయబడింది. బొండా విజయ మల్లిక, మానేపల్లి స్వాతినాగలక్ష్మి, మానేపల్లి విజయలక్ష్మి, మానేపల్లి రజిని, కొత్త ఇందిర, బొండాడ శ్రావణి, తంశెట్టి లావణ్య నేతృత్వంలో ఈ కార్యక్రమం జరిగింది. ముఖ్య అతిథిగా రాష్ట్ర ఆర్యవైశ్య వెల్ఫేర్ & డెవలప్మెంట్ కార్పొరేషన్ డైరెక్టర్ కొత్త వెంకటేశ్వరరావు (కొండబాబు) పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందుకున్నారు. 8 సంవత్సరాల క్రితం ప్రారంభించిన విష్ణు సహస్రనామ పారాయణం ఈరోజు 27 నక్షత్రమాల వరకు కొనసాగిందని బొండా విజయ మల్లిక తెలిపారు. వాసవి క్లబ్ జిల్లా గవర్నర్ మానేపల్లి బంగార్రాజు, జగ్గంపేట ఆర్యవైశ్య సంఘం మహిళలు, వాసవి & వనితా క్లబ్ సభ్యులు ఘనంగా పాల్గొని తీర్థప్రసాదాలు స్వీకరించారు.


