-రాష్ట్ర మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య.
ఒంటిమిట్ట,అక్టోబర్ 09(పున్నమి ప్రతినిధి )
అవినీతి సామ్రాట్ జగన్ రెడ్డికి రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని విమర్శించే నైతికత లేదని రాష్ట్ర కల్లుగీత కార్పోరేషన్ మాజీ డైరెక్టర్ కొమరా వెంకట నరసయ్య అన్నారు.గురువారం ఒంటిమిట్ట హరిత హోటల్లో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వ హయాంలో జరిగిన 3500 కోట్ల అవినీతి లిక్కర్ స్కామ్ లో అంతిమ లబ్ధిదారుడు జగన్ రెడ్డి యే అంటూ సిట్ కు ఆధారాలు లభ్యం కావడంతో తనని ఎక్కడ అరెస్ట్ చేస్తారోనని భయంతో నకిలీ మద్యం సమస్య వైయస్సార్ పార్టీ రాష్ట్రంలో ప్రవేశపెట్టిందన్నారు. 11 సిబిఐ కేసుల్లో ఆరు ఈడీ కేసుల్లో ముద్దాయిగా ఉన్న జగన్ రెడ్డి గడిచిన 11 సంవత్సరాలుగా బెయిల్ పై ఉంటూ ముఖ్యమంత్రి పదవి కూడా వెలగపెట్టి 3500 కోట్ల రూపాయల లిక్కర్ స్కామ్ లో అడ్డంగా చుట్టుకుని తనను ఎక్కడ అరెస్ట్ చేస్తారో అనే భయంతో ఈరోజు నిజాయితీపరుడు మంచికి మారుపేరైన మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పై తప్పుడు ఆరోపణలు చేస్తూ తన బ్లూ మీడియాలో బురదజల్లే ప్రయత్నం జగన్ రెడ్డి చేస్తున్నాడని వెంకట నరసయ్య తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 71 రోజుల తదనంతరం బెయిల్ పై మిధున్ రెడ్డి తణుకు కోర్టు క్లీన్ చిట్టి ఇచ్చినట్టుగా మాట్లాడుతున్నాడని, అంతిమ లబ్ధిదారుడిగా జగన్ రెడ్డి పాత్ర బహిర్గతం అవుతుందని అప్పుడు వీళ్లిద్దరూ రాజమండ్రి సెంట్రల్ జైలు లెక్కపెట్టక తప్పదని ఆయన జోస్యం చెప్పారు. పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కుటుంబాలు గత ఐదు సంవత్సరాల జగన్ రెడ్డి పాలనలో ల్యాండ్, సాండ్ మైన్ ,వైన్, కుంభకోణాలు చేసి అక్రమంగా సంపాదించిన వేల కోట్ల రూపాయలు బహిర్గతం చేయడంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రముఖ పాత్ర పోషిస్తున్నారనే అక్కసుతో ఈరోజు మంత్రిపైది తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. మొలకలచెరువు మద్యం తయారీ కేంద్రం వైయస్సార్ పార్టీ నాయకుల పేరుతో ఉన్న ఆ విషయాన్ని బహిర్గతం చేయకుండా సంబంధంలేని మంత్రి మండిపల్లి పై ఆరోపణలు చేయడం సిగ్గుచేటు అన్నారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న జై చంద్ర రెడ్డిని సురేంద్ర నాయుడుని తెలుగుదేశం పార్టీ సస్పెండ్ చేసిందని గుర్తు చేశారు. జైల్లో ఉన్న చెవిరెడ్డిని గాని బెయిల్ పైనున్న మిథున్ రెడ్డిని కానీ సస్పెండ్ చేసే దమ్ము ధైర్యం జగన్ రెడ్డి కుండా జగన్ రెడ్డి కుందా అంటూ ప్రశ్నించారు. తాము చేస్తున్న అక్రమాలకు అడ్డం వస్తున్నాడని, వెలికితీస్తున్నాడని మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పై తీవ్రమైన తప్పుడు ఆరోపణలతో చేస్తూ ప్రచారం చేస్తున్నారని ఇది జగన్ పార్టీ దిగజారుడు రాజకీయాలకు నిర్దర్శనమన్నారు. రాయలసీమలో తెలుగుదేశం పార్టీలో ఉన్న ఏ నాయకుడు అడ్డుపడినీ విధంగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి అడ్డుపడుతున్నాడని అతని అడ్డు తొలగించుకోవాలనే ఏకైక లక్ష్యంతో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ టార్గెట్గా నీచ రాజకీయాలను వైఎస్ఆర్ పార్టీ ప్రజలకు తీసుకెళ్తుంది అని ఆయన ధ్వజమెత్తడం జరిగింది. వేలకోట్ల కుంభకోణంలో ఇప్పటికే ఇరుక్కుని 17 కేసులు పెట్టించుకున్న జగన్ రెడ్డి మాటలను రాష్ట్ర ప్రజలు నమ్మే పరిస్థితి ఏమాత్రం లేదని ఈ ఆరోపణ మరక మంత్రి మండిపల్లికి అంటుకోదని ఈ జగన్ రెడ్డి సత్యం గ్రహించాలని ఇకనైనా తప్పుడు ఆరోపణలు మానుకోవాలని ఆయన హితువు పలికారు. ఈ కార్యక్రమంలో మామిళ్ళ ఈశ్వరయ్య,టిడిపి పార్లమెంట్ కార్యనిర్వాహ కార్యదర్శి మోదుగుల నరసింహులు, మాజీ మండల పార్టీ అధ్యక్షుడు పామూరు సుబ్రహ్మణ్యం, సింగిల్ విండో మాజీ నందిమండలం సుధాకర్ రాజు, మాజీ ఎంపిటిసి మాబూ సుభాన్, సీనియర్ నాయకులు మామిళ్ళ రామకృష్ణయ్య, రేవిళ్ళ బాలమున్నయ్య, పత్తి కృష్ణయ్య,యువ నాయకుడు వినోద్ రెడ్డి, కృష్ణారెడ్డి రఘునాథ్ రెడ్డి, శ్రీనివాసరెడ్డి, బిసి నాయకుడు మౌలాలి, నడింపల్లి దిలీప్ తదితరులు పాల్గొన్నారు.


