Thursday, 5 February 2026
  • Home  
  • జగదేవి పేట పీహెచ్‌సీలో ఆశా డే సమావేశం – క్యాన్సర్ అవగాహన కార్యక్రమం
- ఆంధ్రప్రదేశ్

జగదేవి పేట పీహెచ్‌సీలో ఆశా డే సమావేశం – క్యాన్సర్ అవగాహన కార్యక్రమం

(పున్నమి ప్రతినిధి) ఇందుకూరుపేట మండలం జగదేవి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 06.01.2026న ఆశా డే సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ బ్రహ్మేశ్వర్ నాయుడు, డాక్టర్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టారు. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు నుంచి వచ్చిన డాక్టర్ హరిప్రియ (ఎండి – రేడియేషన్ ఆంకాలజీ) రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, కారణాలు, నివారణపై అవగాహన కల్పించారు. ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. ప్రతి నెల స్వీయ పరీక్షలు, 40 ఏళ్లు దాటిన మహిళలు మామోగ్రఫీ చేయించుకోవాలని సూచించారు. క్యాన్సర్ లక్షణాలు కనిపించిన వారిని వెంటనే ఆసుపత్రికి పంపించాలని ఆశా వాలంటీర్లకు సూచించారు. ఈ సమావేశంలో వైద్య సిబ్బంది, ఆశా వాలంటీర్లు పాల్గొన్నారు.

(పున్నమి ప్రతినిధి)

ఇందుకూరుపేట మండలం జగదేవి పేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో 06.01.2026న ఆశా డే సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని మెడికల్ ఆఫీసర్లు డాక్టర్ బ్రహ్మేశ్వర్ నాయుడు, డాక్టర్ కిషోర్ కుమార్ ఆధ్వర్యంలో చేపట్టారు. మెడికవర్ క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ నెల్లూరు నుంచి వచ్చిన డాక్టర్ హరిప్రియ (ఎండి – రేడియేషన్ ఆంకాలజీ) రొమ్ము క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ లక్షణాలు, కారణాలు, నివారణపై అవగాహన కల్పించారు. ప్రారంభ దశలో గుర్తిస్తే పూర్తిగా నయం చేయవచ్చని తెలిపారు. ప్రతి నెల స్వీయ పరీక్షలు, 40 ఏళ్లు దాటిన మహిళలు మామోగ్రఫీ చేయించుకోవాలని సూచించారు. క్యాన్సర్ లక్షణాలు కనిపించిన వారిని వెంటనే ఆసుపత్రికి పంపించాలని ఆశా వాలంటీర్లకు సూచించారు. ఈ సమావేశంలో వైద్య సిబ్బంది, ఆశా వాలంటీర్లు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.