ఈ కార్యక్రమాన్ని దండలు వేసి దీక్షను ప్రారంభించిన బార్ అసోసియేషన్ అధ్యక్షులు కామిరెడ్డి వెంకటరావు
చోడవరం నియోజకవర్గంలోని ప్రజల ప్రాణాలను తీస్తున్న అద్వాన్న రోడ్ల పరిస్థితిపై ప్రభుత్వాన్ని మేల్కొలిపేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో నిరవధిక రీలే నిరాహార దీక్ష చోడవరం ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట ప్రారంభమైంది.
వెంకన్నపాలెం – చోడవరం – మాడుగుల – పాడేరు – రోలుగుంట మార్గం లో ఉన్న రహదారులు పూర్తిగా ధ్వంసమై రోడ్లపై చెరువులు ఏర్పడినంత స్థాయికి చేరుకున్నాయి. ఈ రహదారుల కారణంగా రోజూ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతుండగా, పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు, మరెందరో కాళ్లు , చేతులు విరగకొట్టుకుంటూ శాశ్వతంగా వికలాంగులుగా మారుతున్నారు.
ఆసుపత్రులకు వెళ్లే అంబులెన్స్‌లు కూడా ఈ గుంతల రోడ్లలో వెళ్ళలేక ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గ్రామాల మధ్య రవాణా స్తంభించిపోవడంతో విద్యార్థులు, రైతులు, ఉద్యోగులు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు.
ఈ నిరవధిక రీలే నిరాహార దీక్షను అనకాపల్లి జిల్లా కన్వీనర్ కొణతాల హరినాథ్ బాబు చోడవరం ఆప్ ఇన్‌చార్జ్ వేగి మహాలక్ష్మి నాయుడు నిర్వహించగా, ఇది ఆమ్ ఆద్మీ పార్టీ రాష్ట్రాధ్యక్షులు శీర రమేష్ కుమార్ , మార్గదర్శకత్వంలో జరుపబడుతుంది.
ఈ కార్యక్రమానికి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు డాక్టర్ షీతల్ మదన్ , రాష్ట్ర సోషల్ మీడియా ఇన్‌చార్జ్ పావన్ కుమార్ , కాంగ్రెస్ మడుగుల ఇన్‌చార్జ్ పదాల కొండలరావు , ఎమ్ నారాయణ రావు, అప్పలభక్తుల త్రినాథరావు తదితరులు చోడవరం మరియు పరిసర ప్రాంతాల నాయకులు హాజరై సంఘీభావం తెలిపారు.
ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ప్రభుత్వం తక్షణమే రహదారుల పునర్నిర్మాణం చేపట్టి, ప్రజల జీవన భద్రతకు బాధ్యత వహించాలని ఆమ్ ఆద్మీ పార్టీ డిమాండ్ చేసింది.
ప్రత్యేక ధన్యవాదములు బార్ అసోసియేషన్ అధ్యక్షులు కమిరెడ్డి వెంకటరావు కి, నిరాహార దీక్షలో పాల్గొన్న వారిని మాలలతో అలంకరించి, ఈ ఉద్యమ విజయానికి తన ఆశీస్సులు అందించినందుకు.
ఆమ్ ఆద్మీ పార్టీ ప్రజల పక్షాన నిలబడి, ప్రజల ప్రాణాలను రక్షించేందుకు నిరంతర పోరాటం కొనసాగిస్తుందని పార్టీ రాష్ట్ర నాయకత్వం స్పష్టం చేసింది.


