*చేనేతల ఆవేదన*
నాటి స్వదేశీ ఉద్యమానికి నాంది చేనేత. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి ఆశ్చర్యపరచిన కళా నైపుణ్యాలు చేనేత కళాకారులవే. భవిష్యత్ తరాలలో ఈ కళాకారులు కలగానే మిగిలిపోతారని ఆవేదన. ఒకవైపు ప్రపంచీకరణ, మరో వైపు యాంత్రికరణ వస్త్రాలపై ఆసక్తి వెరసి నేతన్నపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి అవుతున్న చేనేత జీవితాలలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారంటే ఆలోచించవలసిన అవసరం ప్రభుత్వాలకి ఎంతగానో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేతన్నల కొరకు చేనేతభరోసా, నేతన్న పొదుపు లాంటి కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది. చేనేత కార్మికులును రుణ విముక్తులను చేయడం కోసం రాష్ట్రంలోని చేనేత కార్మికులకు లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తానని గత ఏడాది సెప్టెంబర్ 9న NIHT ప్రారంభోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించి ఇప్పటికీ 14 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అమలు కాలేదు. చేనేత కార్మికుల లక్ష రుణమాఫీకి లక్ష కారణాలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎన్నికల కోడ్ మరియు సరిపడా బడ్జెట్ కేటాయింపులు ఇవ్వకపోవడంతో తీవ్ర జాప్యం జరుగుతుంది. అలాగే చేనేత కార్మికులకు పని కల్పించే సహకార సంఘాల వ్యవస్థ మూతపడి సంవత్సరాలు గడుస్తున్నాయి. సహకార సంఘాలకు పాలకవర్గాలు లేక సుమారుగా ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చేనేత వస్త్రాలు ప్రభుత్వం TSCO ద్వారా కొనుగోలు చేయకపోవడంతో ఎగుమతులు లేక వస్త్ర నిలువలు పేరుకుపోయాయి. దయనీయ పరిస్థితిలోకి చేనేత వ్యవస్థ చేరుకున్నది. చేనేత వ్యవస్థలోని కార్మికులకు పని దొరుకకా కులవృత్తిని వదులుకోలేక ఇతర వృత్తుల పనులు చేయలేక దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతపై ప్రత్యేక దృష్టిని పెట్టి వారికి బడ్జెట్లో అధిక మొత్తంలో కేటాయింపులు, సబ్సిడీలను సంక్షేమ పథకాలను అందించడం, చేనేత డిజన్లను ప్రింటింగ్ చేయకుండా కట్టడీ చేయడం, చేనేత వస్త్రాలపై, నూలు రంగు రసాయనాలు, ముడి సరుకులపై ZERO GST తీసుకురావసిఉన్నది. నేతన్నల సంక్షేమాన్ని కాంక్షించి, వారికి దీర్ఘకాలికంగా ఆర్థిక చేయూతనిచ్చే పథకాలు తీసుకురావాలి. కులవృత్తిని చేసుకుంటున్న అణగారిన వర్గాలు, ముఖ్యంగా మనకు నాగరికత నేర్పిన నేతన్నలకి వెన్నుదన్నుగా నిలబడడమే ప్రభుత్వలా లక్ష్యం కావాలి. అప్పుడే నేతన్న కుటుంబాల్లో నిజమైన వెలుగులు నిండి తిరిగి చేనేత పూర్వ వైభవం సంతరించుకోగలదు.
-చెరుపల్లి రఘుపతి నేత,
నల్లగొండ.

చేనేతల ఆవేదన
*చేనేతల ఆవేదన* నాటి స్వదేశీ ఉద్యమానికి నాంది చేనేత. అగ్గిపెట్టెలో పట్టే చీరను నేసి ఆశ్చర్యపరచిన కళా నైపుణ్యాలు చేనేత కళాకారులవే. భవిష్యత్ తరాలలో ఈ కళాకారులు కలగానే మిగిలిపోతారని ఆవేదన. ఒకవైపు ప్రపంచీకరణ, మరో వైపు యాంత్రికరణ వస్త్రాలపై ఆసక్తి వెరసి నేతన్నపై తీవ్ర ప్రభావం చూపుతున్నది. స్వాతంత్ర్యం వచ్చి 79 సంవత్సరాలు పూర్తి అవుతున్న చేనేత జీవితాలలో ఎలాంటి మార్పు రాలేదు. ఇప్పటికీ దారిద్ర్య రేఖ దిగువన ఉన్నారంటే ఆలోచించవలసిన అవసరం ప్రభుత్వాలకి ఎంతగానో ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నేతన్నల కొరకు చేనేతభరోసా, నేతన్న పొదుపు లాంటి కొన్ని పథకాలు ప్రవేశపెట్టింది. చేనేత కార్మికులును రుణ విముక్తులను చేయడం కోసం రాష్ట్రంలోని చేనేత కార్మికులకు లక్ష రూపాయల లోపు రుణాలు మాఫీ చేస్తానని గత ఏడాది సెప్టెంబర్ 9న NIHT ప్రారంభోత్సవ సందర్భంగా ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ప్రకటించి ఇప్పటికీ 14 నెలలు గడుస్తున్నా ఇప్పటికీ అమలు కాలేదు. చేనేత కార్మికుల లక్ష రుణమాఫీకి లక్ష కారణాలు అడ్డంకులు ఎదురవుతున్నాయి. ఎన్నికల కోడ్ మరియు సరిపడా బడ్జెట్ కేటాయింపులు ఇవ్వకపోవడంతో తీవ్ర జాప్యం జరుగుతుంది. అలాగే చేనేత కార్మికులకు పని కల్పించే సహకార సంఘాల వ్యవస్థ మూతపడి సంవత్సరాలు గడుస్తున్నాయి. సహకార సంఘాలకు పాలకవర్గాలు లేక సుమారుగా ఏడు సంవత్సరాలు గడుస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. చేనేత వస్త్రాలు ప్రభుత్వం TSCO ద్వారా కొనుగోలు చేయకపోవడంతో ఎగుమతులు లేక వస్త్ర నిలువలు పేరుకుపోయాయి. దయనీయ పరిస్థితిలోకి చేనేత వ్యవస్థ చేరుకున్నది. చేనేత వ్యవస్థలోని కార్మికులకు పని దొరుకకా కులవృత్తిని వదులుకోలేక ఇతర వృత్తుల పనులు చేయలేక దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేనేతపై ప్రత్యేక దృష్టిని పెట్టి వారికి బడ్జెట్లో అధిక మొత్తంలో కేటాయింపులు, సబ్సిడీలను సంక్షేమ పథకాలను అందించడం, చేనేత డిజన్లను ప్రింటింగ్ చేయకుండా కట్టడీ చేయడం, చేనేత వస్త్రాలపై, నూలు రంగు రసాయనాలు, ముడి సరుకులపై ZERO GST తీసుకురావసిఉన్నది. నేతన్నల సంక్షేమాన్ని కాంక్షించి, వారికి దీర్ఘకాలికంగా ఆర్థిక చేయూతనిచ్చే పథకాలు తీసుకురావాలి. కులవృత్తిని చేసుకుంటున్న అణగారిన వర్గాలు, ముఖ్యంగా మనకు నాగరికత నేర్పిన నేతన్నలకి వెన్నుదన్నుగా నిలబడడమే ప్రభుత్వలా లక్ష్యం కావాలి. అప్పుడే నేతన్న కుటుంబాల్లో నిజమైన వెలుగులు నిండి తిరిగి చేనేత పూర్వ వైభవం సంతరించుకోగలదు. -చెరుపల్లి రఘుపతి నేత, నల్లగొండ.

