అక్టోబర్ చేజర్ల (పున్నమి ప్రతినిధి)
చేజర్ల జిల్లా ప్రజా పరిషత్ ఉన్నత పాఠశాల నందు అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అంగన్వాడి సూపర్వైజర్ ఎం పద్మ మాట్లాడుతూ, పిల్లలందరికీ బాల్యవివాహాలు మరియు రక్తహీనత గురించి మరియు శారీరకంగా, మానసికంగా పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాలంటే రక్తహీనత లేకుండా మంచి పోషకాలు ఉన్నటువంటి ఆహారాన్ని పిల్లలందరూ తీసుకొని ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నించాలని, చైల్డ్ హెల్ప్ లైన్ 1098 మరియు వన్ స్టాప్ సఖి181 నంబర్లకు సమస్య వచ్చినప్పుడు కాల్ చేస్తే వారి యొక్క సహాయం పొందవచ్చునని పిల్లలందరికీ తెలియజేశారు.ఈ కార్యక్రమం నందు అంగన్వాడీ సూపర్వైజర్, అంగన్వాడీ కార్యకర్తలు, బాలికలు పాల్గొన్నారు.


