అక్టోబర్ చేజర్ల పున్నమి ప్రతినిధి
మండల కేంద్రమైన చేజర్ల గ్రామంలో దక్షిణపు వీధి లో ఉన్న పోలేరమ్మ గుడిలో దసరా శరన్నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా గురువారం అమ్మవారికి జరిగిన కుంకుమ పూజ,చేజర్ల మండల టిడిపి పార్టీ అధ్యక్షులు షేక్ సిరజుద్దీన్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహించి పాల్గొన్నారు. పూజలో పాల్గొన్న భక్తులకు, ప్రజలకు అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేజర్ల మండల ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ప్రజలందరూ సుఖశాంతులతో ఉండాలని దుర్గాదేవి అమ్మవారిని ప్రార్థించారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నెల్లూరు జిల్లా పార్లమెంటరీ సెక్రెటరీ రావి పెంచలరెడ్డి, సొసైటీ అధ్యక్షులు బూదళ్ళ వీర రాఘవరెడ్డి, జిల్లా బిజెపి నాయకులు మరియు రాష్ట్ర వడ్డెర కార్పొరేషన్ డైరెక్టర్ బత్తల కిష్టయ్య, తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు రావి లక్ష్మీ నరసారెడ్డి,ఎంపీటీసీ మస్తానయ్య,టీడీపీ పార్టీ కార్యనిర్వాహక కార్యదర్శి బి.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.


