సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి)
చేజర్ల మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో మండల సాధారణ సర్వసభ్య సమావేశం జరిగింది. మండల అభివృద్ధి పై అన్ని శాఖల అధికారులతో సమీక్ష నిర్వహించారు. అభివృద్ధి కార్యక్రమాల అమలు, ప్రజా సమస్యల పరిష్కారం, ప్రభుత్వ పథకాల ప్రభావం వంటి అంశాలపై చర్చ సాగింది. మండలంలో అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని సూచనలు చేయడంతో పాటు సమన్వయంతో ముందుకు సాగాలని అధికారులు నిర్ణయించారు. ఈ సమావేశంలో సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి,ఎంపీపీ తూమాటి భాస్కర్ రెడ్డి, జడ్పిటిసి పార్థసారథి, ఎంపీడీవో అమర్ సహా మండల అధికారులు పాల్గొన్నారు.

