సెప్టెంబరు చేజర్ల (పున్నమి ప్రతినిధి)
చేజర్ల మండల కొత్త ఎంపీడీఓగా ఎ. అలీషా బాబు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సాధారణ బదిలీలలో భాగంగా బాపట్ల నుండి చేజర్ల మండలానికి బదిలీ అయిన ఆయన, అధికారికంగా పదవీ బాధ్యతలు చేపట్టారు.
ఈ సందర్భంగా ఎంపీడీఓ అలీషా బాబు మాట్లాడుతూ, మండల పరిధిలో అభివృద్ధి పనులు వేగవంతం చేయడానికి కృషి చేస్తానని, ప్రజల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. అలాగే ప్రభుత్వ సంక్షేమ పథకాలను అర్హులైన లబ్ధిదారులకు పారదర్శకంగా అందించే విధంగా చర్యలు తీసుకుంటానని ఆయన స్పష్టం చేశారు.
పదవీ స్వీకార కార్యక్రమంలో మండల పరిధిలోని సిబ్బంది, పంచాయతీ కార్యదర్శులు, స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొని కొత్త ఎంపీడీఓని అభినందించారు. అలీషా బాబు అనుభవజ్ఞుడైన అధికారి కావడంతో, ఆయన రాకతో మండల అభివృద్ధి మరింత పురోగతి సాధిస్తుందని స్థానిక ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.


