Thursday, 5 February 2026
  • Home  
  • చేజర్లలో సొసైటీ అధ్యక్షులు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం
- E-పేపర్

చేజర్లలో సొసైటీ అధ్యక్షులు, డైరెక్టర్ల ప్రమాణ స్వీకారం

చేజర్ల సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి) చేజర్ల మండల సొసైటీ అధ్యక్షులు బూదళ్ల వీర రాఘవరెడ్డి,డైరెక్టర్లు మదమంచి సుధీర్‌కుమార్, ఆరెద్దుల రామకృష్ణ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.తమకు ఈ అవకాశం కల్పించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి, సీనియర్ టిడిపి నాయకులు తాళ్లూరు గిరినాయుడుకి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. సొసైటీ అభివృద్ధికి,రైతుల కృషి కోసం కట్టుబడి పనిచేస్తామని నూతన అధ్యక్షులు,డైరెక్టర్లు భరోసా ఇచ్చారు. మండల కన్వీనర్ షేక్ సిరాజుద్దీన్ మాట్లాడుతూ, గతంలో ఉన్న అనుభవం కారణంగా ఈ పదవికి వారు అర్హులని అన్నారు.సీనియర్ నాయకులు కొమ్మి సిద్ధులునాయుడు మాట్లాడుతూ,రైతులకు అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి, నెల్లూరు జిల్లా పార్లమెంటరీ సెక్రటరీ రావి పెంచలరెడ్డి,మాజీ ఎంపీపీ అన్నలూరు శ్రీనివాసులు నాయుడు,సీనియర్ నాయకులు కొమ్మి సిద్ధులునాయుడు,మండల ప్రధాన కార్యదర్శి తలపనేని జయంతులునాయుడు, వావిలేరు సర్పంచ్ గోనుగుంట రాంబాబు, సోమశిల 24 ఎల్ చైర్మన్ ఉడత హజరతయ్య,తెలుగు యువత అధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి సీనియర్ నాయకులు మోదేపల్లి పెంచల నాయుడు,భారతీయ మహాసేన అధ్యక్షులు జువ్విగుంట బాబు,ఎంపీటీసీ షేక్.మస్తాన్,బీజేపీ నాయకులు బత్తల కిష్టయ్య, గుండాల విజయభాస్కర్ రెడ్డి, జనసేన నాయకులు షేక్ నజీర్‌తో పాటు పలువురు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

చేజర్ల సెప్టెంబర్ (పున్నమి ప్రతినిధి)

చేజర్ల మండల సొసైటీ అధ్యక్షులు బూదళ్ల వీర రాఘవరెడ్డి,డైరెక్టర్లు మదమంచి సుధీర్‌కుమార్, ఆరెద్దుల రామకృష్ణ ప్రమాణ స్వీకార కార్యక్రమం ఘనంగా జరిగింది.ఈ సందర్భంగా పూజా కార్యక్రమాలు నిర్వహించారు.తమకు ఈ అవకాశం కల్పించిన దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డికి, సీనియర్ టిడిపి నాయకులు తాళ్లూరు గిరినాయుడుకి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. సొసైటీ అభివృద్ధికి,రైతుల కృషి కోసం కట్టుబడి పనిచేస్తామని నూతన అధ్యక్షులు,డైరెక్టర్లు భరోసా ఇచ్చారు.
మండల కన్వీనర్ షేక్ సిరాజుద్దీన్ మాట్లాడుతూ, గతంలో ఉన్న అనుభవం కారణంగా ఈ పదవికి వారు అర్హులని అన్నారు.సీనియర్ నాయకులు కొమ్మి సిద్ధులునాయుడు మాట్లాడుతూ,రైతులకు అన్ని విధాలుగా తోడ్పాటును అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో సోమశిల ప్రాజెక్టు చైర్మన్ వేలూరు కేశవ చౌదరి, నెల్లూరు జిల్లా పార్లమెంటరీ సెక్రటరీ రావి పెంచలరెడ్డి,మాజీ ఎంపీపీ అన్నలూరు శ్రీనివాసులు నాయుడు,సీనియర్ నాయకులు కొమ్మి సిద్ధులునాయుడు,మండల ప్రధాన కార్యదర్శి తలపనేని జయంతులునాయుడు, వావిలేరు సర్పంచ్ గోనుగుంట రాంబాబు, సోమశిల 24 ఎల్ చైర్మన్ ఉడత హజరతయ్య,తెలుగు యువత అధ్యక్షులు ఆదినారాయణ రెడ్డి సీనియర్ నాయకులు మోదేపల్లి పెంచల నాయుడు,భారతీయ మహాసేన అధ్యక్షులు జువ్విగుంట బాబు,ఎంపీటీసీ షేక్.మస్తాన్,బీజేపీ నాయకులు బత్తల కిష్టయ్య, గుండాల విజయభాస్కర్ రెడ్డి, జనసేన నాయకులు షేక్ నజీర్‌తో పాటు పలువురు మండల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Leave a comment

Your email address will not be published. Required fields are marked *

About Us

పున్నమి తెలుగు దిన పత్రిక ప్రజలకు నిజమైన, సమయానుకూలమైన, మరియు సమగ్ర వార్తలను తెలుగులో అందించడమే మా లక్ష్యం.
రాజకీయాలు నుంచి సినిమాలు వరకూ అన్ని విభాగాల్లో విశ్వసనీయ సమాచారం అందిస్తూ, సమాజాన్ని చైతన్యవంతం చేయడమే మా కర్తవ్యం.

Email Us: punnami.news@gmail.com

Subscribe

పున్నమి  @2025. All Rights Reserved.