చెముడుగుంటలో ‘మనబడికి పోదాం’

0
162

చెముడుగుంటలో ‘మనబడికి పోదాం’

వెంకటాచలం, మార్చి 30 (పున్నమి విలేకరి):

మండలంలోని చెముడుగుంట పంచాయతీలో ‘మనబడికి పోదాం’ కార్యక్రమాన్ని ఎంఈఓ మధుసూదన్ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా కాంప్లెక్స్ హెచ్ఎం ఏవి రమేష్ కుమార్, సి ఆర్ పి హరి చెముడుగుంట పంచాయతీలోని నక్కలకాలనీ, బురాన్ పూర్, కుంకుమ పూడి గ్రామాల్లో ఇంటింటికి తిరిగి సర్వే నిర్వహించారు. బడి బయట పిల్లలను గుర్తించి ప్రభుత్వం అందిస్తున్న పథకాల గురించి వారి తల్లిదండ్రులకు వివరించారు. అనంతరం గుర్తించిన పిల్లలను సమీపంలోని పాఠశాలలో చేర్పించి వారి వివరాలను యాప్ లో పొందుపరిచారు. ఈ కార్యక్రమంలో ఎడ్యుకేషనల్ అసిస్టెంట్ కే. ప్రతాప్, తదితరులు పాల్గొన్నారు.

0
0