చెన్నై అంబత్తూరు లోని జపనీస్ కవి పేరుతో పాతికేళ్లుగా డాక్టర్ సేతు కుమనన్ వ్యవస్థాపకులుగా నడుపుతున్న మహిళా కళాశాల, ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఎథిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో మారుతున్న కొత్త ఆవిష్కరణల ప్రపంచంలో యువత మేధస్సు కొత్త దిశానిర్దేశం అంశంతో అంతర్జాతీయ సదస్సు, కవితా సమ్మేళనం జరిగింది.అతిథుల జ్యోతి ప్రజ్వలనం, తమిళ రాష్ట్ర గీతం తో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ డా సేతు కుమనన్ తమ కళాశాల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యువ విద్యార్థినిలను ప్రభావితం చేయగలదని ఆశించారు. ఈ సందర్భంగా డాక్టర్ సేతు కుమనన్ సదస్సు కార్యనిర్వాహకులు డాక్టర్ జర్నైల్ సింగ్ ఆనంద్, డాక్టర్ పెరుగు రామకృష్ణ లను సోక ఇకేదా స్మారక మెగా సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. డాక్టర్ జర్నైల్ సింగ్ ఆనంద్ తమ సంస్థ తరఫున అంతర్జాతీయ కవి పెరుగు రామకృష్ణ ను రోల్ ఆఫ్ హానర్ తో
కవయిత్రి పెరుగు సుజనారామం ను అంబాసిడర్ ఆఫ్ ఎటర్నిటీ అవార్డుతో సత్కరించారు. ముగింపు సదస్సు లో చెన్నై హైకోర్టు న్యాయవాది, ద్విభాషా కవి వానవిల్ రవి నెల్లూరు దిగ్గజ కవి రామకృష్ణ ను మహాకవి భారతి అవార్డు తో ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా విచ్చేసిన ప్రముఖ కవులు, రచయితలు అభినందించారు..!

చెన్నై అంతర్జాతీయ సదస్సులో డాక్టర్ పెరుగు దంపతులకు అవార్డులు
చెన్నై అంబత్తూరు లోని జపనీస్ కవి పేరుతో పాతికేళ్లుగా డాక్టర్ సేతు కుమనన్ వ్యవస్థాపకులుగా నడుపుతున్న మహిళా కళాశాల, ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ ఎథిక్స్ సంయుక్త ఆధ్వర్యంలో మారుతున్న కొత్త ఆవిష్కరణల ప్రపంచంలో యువత మేధస్సు కొత్త దిశానిర్దేశం అంశంతో అంతర్జాతీయ సదస్సు, కవితా సమ్మేళనం జరిగింది.అతిథుల జ్యోతి ప్రజ్వలనం, తమిళ రాష్ట్ర గీతం తో కార్యక్రమం ఘనంగా ప్రారంభమైంది. ప్రారంభ కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ డా సేతు కుమనన్ తమ కళాశాల ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని యువ విద్యార్థినిలను ప్రభావితం చేయగలదని ఆశించారు. ఈ సందర్భంగా డాక్టర్ సేతు కుమనన్ సదస్సు కార్యనిర్వాహకులు డాక్టర్ జర్నైల్ సింగ్ ఆనంద్, డాక్టర్ పెరుగు రామకృష్ణ లను సోక ఇకేదా స్మారక మెగా సాహిత్య పురస్కారం ప్రదానం చేశారు. డాక్టర్ జర్నైల్ సింగ్ ఆనంద్ తమ సంస్థ తరఫున అంతర్జాతీయ కవి పెరుగు రామకృష్ణ ను రోల్ ఆఫ్ హానర్ తో కవయిత్రి పెరుగు సుజనారామం ను అంబాసిడర్ ఆఫ్ ఎటర్నిటీ అవార్డుతో సత్కరించారు. ముగింపు సదస్సు లో చెన్నై హైకోర్టు న్యాయవాది, ద్విభాషా కవి వానవిల్ రవి నెల్లూరు దిగ్గజ కవి రామకృష్ణ ను మహాకవి భారతి అవార్డు తో ప్రత్యేకంగా సన్మానించారు. ఈ సందర్భంగా దేశ వ్యాప్తంగా విచ్చేసిన ప్రముఖ కవులు, రచయితలు అభినందించారు..!

